రీసర్వేపై అపోహలొద్దు!
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:35 PM
రీసర్వేపై రైతు లు అపోహలు చెందవద్దని కనిగిరి ఇన్‌చార్జ్ ఆర్డీవో, వె లిగొండ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.వెంకటశివరామి రెడ్డి అన్నారు. అధికారులకు రైతులు సహకరించాలని ఆయన కోరారు. మండలంలోని పే రుంబొట్లపాలెం గ్రామంలో జరుగుతున్న రీసర్వేను గురువారం ఆయన పరిశీలించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో 693 ఎకరాల భూమి ఉంద ని చెప్పారు.

కురిచేడు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): రీసర్వేపై రైతు లు అపోహలు చెందవద్దని కనిగిరి ఇన్‌చార్జ్ ఆర్డీవో, వె లిగొండ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.వెంకటశివరామి రెడ్డి అన్నారు. అధికారులకు రైతులు సహకరించాలని ఆయన కోరారు. మండలంలోని పే రుంబొట్లపాలెం గ్రామంలో జరుగుతున్న రీసర్వేను గురువారం ఆయన పరిశీలించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో 693 ఎకరాల భూమి ఉంద ని చెప్పారు. ఇందులో 229 ఎకరాలు ప్రభుత్వ భూమి, 464 ఎకరాల రైతుల భూమి ఉందన్నారు. గతంలో జరుగుతున్న సర్వేలో అక్కడక్కడా లోపాలు తలెత్తడంతో వాటిని రీసర్వే చేస్తున్నట్టు చెప్పారు. గతంలో సర్వే జరిగే సమయంలో రైతులు లేకపోవడంతో కొన్ని తేడాలు వచ్చాయన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సదరు రైతులకు ముం దస్తు నోటీసులు ఇచ్చి రీసర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా పొరబాటు జర గకుండా పటిష్టమైన ఏర్పాటుచేస్తు న్నట్లు చెప్పారు. అందుకోసం ఒక బృందాన్ని ప్రత్యే కంగా నియమించామన్నారు. అధికారులకు సొంత నిర్ణ యాలు ఉండవని, రైతులతో మాట్లాడి వారి భూమికి సక్రమంగా హద్దులు నిర్ణయిస్తారని చెప్పారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలపై విచారణ చేశామని ఇన్‌చార్జ్ ఆర్డీవో తెలిపా రు. 252 అర్జీలు రాగా, 212 పరిష్కరించినట్టు చెప్పారు. కొన్నింటిని ఎందుకు పరిష్క రించలేకపోయామో అర్జీదారులకు తెలియజేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో తహసీ ల్దార్ రజనీకుమారి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.