Share News

ఎన్‌టీఆర్‌ భరోసా ఫించన్‌ పంపిణీ

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:25 AM

ఎన్‌టీఆర్‌ భరోసా పథకం కింద లబ్ధిదారులకు శనివారం ఫించన్‌ పంపిణీ చేయకుండా వెళ్లి పోయిన 18వ సచివాలయం ఎమినిటీస్‌ సెక్రటరీ పాలడుగు వెంకటేశ్వర్లు ఎట్టకేలకు ఆదివారం నగదు తీసుకుని వచ్చి మున్సిపల్‌ అధికారులకు అప్పజెప్పారు.

ఎన్‌టీఆర్‌ భరోసా ఫించన్‌ పంపిణీ

మార్కాపురం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఎన్‌టీఆర్‌ భరోసా పథకం కింద లబ్ధిదారులకు శనివారం ఫించన్‌ పంపిణీ చేయకుండా వెళ్లి పోయిన 18వ సచివాలయం ఎమినిటీస్‌ సెక్రటరీ పాలడుగు వెంకటేశ్వర్లు ఎట్టకేలకు ఆదివారం నగదు తీసుకుని వచ్చి మున్సిపల్‌ అధికారులకు అప్పజెప్పారు. దీంతో 18వ సచి వాలయం పరిధిలోని ఒంటెద్దు బండి కాలనీ లోని 61 మంది లబ్ధిదారులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు రూ.2.66 లక్షల ఫించన్‌ సొమ్మును పంపిణీ చేశారు. ఈ నెల 1వ తేదీన ఫించన్‌ చేయాల్సిన ఎమినిటీస్‌ సెక్రటరీ వెంకటేశ్వర్లు అధికారులకు సమా చారం ఇవ్వకుండా వెళ్లిపోయాడు. సాయంత్ర మైన ఫించన్‌ సొమ్ము పంచకుండా, అధి కారులకు ఇవ్వకుండా ఉండడంతో కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన టౌన్‌ ఎస్సై సైదుబాబు విచారణ ప్రారంభించి వెంకటేశ్వర్లు ఆచూకీ కనుగొన్నాడు. పింఛన్‌ సొమ్ము రూ.2.66 లక్షలను ఆదివారం ఉదయం పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. ఈ విషయాన్ని కమిషనర్‌ నారాయణరావుకు తెలియజేశారు. ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడారు. వారి ఆదేశాల మేరకు వెంటనే లబ్ధిదారులందరికీ పింఛన్‌ సొమ్ము అందజే శారు. కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బందితో పాటు కౌన్సిలర్లు నాలి కొండయ్య, షేక్‌ చిన్నషెక్షావలిలు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 12:25 AM