శాస్త్రీయ దృక్పథంతోనే సమాజ వికాసం
ABN , Publish Date - Mar 01 , 2025 | 01:25 AM
శాస్త్రీయ దృక్పథంతోనే సమాజ వికాసం సాధ్యమని డీఎస్పీ నాగరాజు అన్నారు. స్థానిక రాక్‌వెల్ పాఠశాల లో సైన్స్‌డేను పురస్కరించుకుని శుక్రవారం సైన్స్ ఎక్స్‌పో నిర్వహించారు.
మార్కాపురం వన్‌టౌన్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): శాస్త్రీయ దృక్పథంతోనే సమాజ వికాసం సాధ్యమని డీఎస్పీ నాగరాజు అన్నారు. స్థానిక రాక్‌వెల్ పాఠశాల లో సైన్స్‌డేను పురస్కరించుకుని శుక్రవారం సైన్స్ ఎక్స్‌పో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన వివిధ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్ నాయక్, పాఠశాల డైరెక్టర్ వెన్నా నాగార్జునరెడ్డి, ప్రిన్సిపాల్ నవీన్ కుమార్‌లు పాల్గొన్నారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. మొట్టమొదటి భారతీయ నోబెల్ బహుమతి గ్రహిత సర్ సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వాసవీ పాఠశాలలో డైరెక్టర్ రంగయ్య ఆధ్వర్యంలో సీవీ.రామన్ చిత్రపటానికి నివాళులర్పించారు. జీఎంఆర్ పాఠశాలలో ప్రిన్సిపాల్ జి.మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సాయి చైతన్య హైస్కూల్‌లో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కరస్పాండెంట్ చంద్రశేఖర్‌ల ఆధ్వర్యంలో సైన్స్‌ఫెయిర్ నిర్వహించారు. కమలా ఉన్నత పాఠశాలలో పాఠశాల వైస్ ఛైర్మన్ పెనుగొండ పవన్‌కుమార్ వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించారు. ప్రిన్సిపాల్ పుల్లయ్య, పాఠశాల అకడ మిక్ డైరెక్టర్ సింధూజ పాల్గొన్నారు. శ్రీ చైతన్య పాఠశాలలో ఏ1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపా ల్ శ్రీధర్ సైన్సుప్రదర్శన ప్రారంభిం చారు. ప్రిన్సిపాల్ ఏ.ఆదినారాయణ, డీన్ శ్రీనివాసులు, ఏఓ కృష్ణారెడ్డి తది తరులు పాల్గొన్నారు.
పెద్దదోర్నాల : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ సావిత్రీ ఆధ్వ ర్యంలో, చిన్నదోర్నాల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానో పాధాయులు మండ్ల శ్రీనివాసులు అధ్యక్షతన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.వేడుకల్లో భాగంగా సీవీ.రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భౌతికశాస్త్ర అధ్యాప కులు కే.విజయబాబు మాట్లాడు తూ సీవీ.రామన్ ప్రపంచానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ క్రమంలో 1929లో బ్రిటీష్ ప్రభుత్వం నైట్‌హుడ్ బిరుదును ప్రధానం చేశారన్నారు. 1930లో నోబెల్ బహుమతి, 1954లో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించారన్నారు. సైన్స్‌లో విద్యార్ధులు అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఐక్యూ ఏసీ కో-ఆర్డినేటర్ శ్రీనివాసాచా ర్యులు, అధ్యాపక సిబ్బంది, ఉపాధ్యాయ సిబ్బంది కెజియారాణి, పాఠశాల చైర్మన్ సుబ్బారావు పాల్గొన్నారు.
శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందించాలి
పొదిలి : విద్యార్థులలో చిన్నతనం నుంచే శాస్ర్తీయ దృక్పథాన్ని ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కే.సుబ్రహ్మణ్యం అన్నారు. జేవీవీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా బాలుర ఉన్నత పాఠశాలలో జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలలో ఉన్న ముఢనమ్మకాలను రూపుమాపడానికి జేవీవీ కార్యకర్త లు కృషి చేయాలన్నారు. కొనకనమిట్ల వైద్యాధి కారి బాలయ్య మాట్లాడుతూ సైన్స్‌ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. దాని వలన అంతరాలు లేని సమాజాన్ని నిర్మించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్‌హై నాయకులు బాలవెంకటేశ్వర్లు, జేవీవీ నాయకులు తోట శ్రీనివాసు లు, గోనే శ్రీను, జె వెంకటేశ్వర్లు, ఆంజనేయ చౌదరి, ఎన్జీవో సంఘ నాయకులు శ్రీనివాసరెడ్డి, మదార్‌వలి, బేగ్ తదితరులు పాల్గొన్నారు.
సైన్స్ దినోత్సవ వేడుకలు
గిద్దలూరు : పట్టణంలోని విశ్వభారతి పాఠశాలలో సైన్స్‌దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రూపొందించి ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులు ఆలోచింపజేశాయి. కార్యక్ర మంలో కరస్పాండెంట్ జి.రంగస్వామిరెడ్డి, ప్రిన్సిపాల్ ఆదిలక్ష్మి, బీజేపీ నాయకులు పిడతల రమేష్‌రెడ్డి, దూదేకుల బాదుల్లా, తదితరులు పాల్గొన్నారు. రాచర్లలోని స్పందన విద్యాసంస్థల్లో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 35కు పైగా సైన్స్ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు.
తర్లుపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో..
తర్లుపాడు : తర్లుపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాలలో సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు నమోనాలను తయారు చేసి ప్రదర్శించారు. లింగారెడ్డి కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో 100 రాకెట్ల నమూనాను విద్యార్థులతో తయారు చేయించి ప్రదర్శించారు. ఈ నామూనాలను నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ గణేష్‌కుమార్ పరిశీలించి విద్యార్థులకు సైన్సుపట్ల అవగాహన కల్పించి పలు సందేహాలను నివృత్తి చేశారు. విద్యార్థు లకు మంచి భవిష్యత్తుకు గుణాత్మక విద్యకు నవోదయ పాఠశాలలో చేరాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం షేక్ మౌలాలి, ఎం.సుధాకర్ బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
కంభం : దైనందిన జీవితంలో సైన్స్ ప్రాముఖ్యతను వివరించేందుకు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహి స్తున్నట్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాలను స్ఫూర్తిదాయకంగా నిర్వహించా రు. ముందుగా సీవీ.రామన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు కిరణ్‌కుమార్, పాండు రంగబాబు, పలువురు ఉపాధ్యాములు పాల్గొన్నారు.