ఊరి వేసుకోని వివాహిత మృతి
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:16 PM
మానసిక ఒత్తిడికిలోనై నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకోని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది.

ఎర్రగొండపాలెం రూరల్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : మానసిక ఒత్తిడికిలోనై నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకోని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానిక పంచాయతీ రాజ్ కార్యాలయం ఎదురుగా కుందారపు వసంతలక్ష్మీ(51) భర్త, కుమారుడితో కలసి టిఫిన్ సెంటరును నడుపుతున్నారు. కొద్ది రోజులుగా ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పాటు మానసికంగా ఒత్తిడికి లోనైందని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పారు. విషయం తెలుసుకున్న ఎస్సై పి.చౌడయ్య సంఘటన స్థలానికి చెరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.