Share News

రైతులతోనే దేశ పురోగతి

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:20 PM

రైతు ల అభ్యున్నతితోనే దేశం పురోగతి సా ధిస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అధికా రి ఎస్‌.శ్రీనివాసరావు అన్నారు. సోమవా రం స్థ్ధానిక కృషి విజ్ఞాన కేంద్రంలో పీఎం కిసాన్‌ నిధులు విడుదల సంద ర్భంగా ఆదర్శ రైతులను ఘనంగా సన్మా నించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ప్రజలందరూ రుణపడి ఉన్నారన్నారు. ప్రస్తుతం ఎన్నో కష్టనష్టాలకోర్చి వ్యవసాయంలో నష్టాలు వస్తున్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో పంటలు పండిస్తున్నారని తెలిపారు.

రైతులతోనే దేశ పురోగతి
మాట్లాడుతున్న డీఏవో శ్రీనివాసరావు, పాల్గొన్న శాస్త్రవేత్తలు

జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాసరావు

దర్శి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): రైతు ల అభ్యున్నతితోనే దేశం పురోగతి సా ధిస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అధికా రి ఎస్‌.శ్రీనివాసరావు అన్నారు. సోమవా రం స్థ్ధానిక కృషి విజ్ఞాన కేంద్రంలో పీఎం కిసాన్‌ నిధులు విడుదల సంద ర్భంగా ఆదర్శ రైతులను ఘనంగా సన్మా నించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ప్రజలందరూ రుణపడి ఉన్నారన్నారు. ప్రస్తుతం ఎన్నో కష్టనష్టాలకోర్చి వ్యవసాయంలో నష్టాలు వస్తున్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో పంటలు పండిస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు అమలుచేస్తున్నట్టు చెప్పారు. సబ్సిడీపై ఎరు వులు, పురుగు మందులు అందించటంతో పాటు పెట్టు బడి నిధి కింద నగదు కూడా అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం 19వ విడతగా విడుదల చేసిన పీఎం కిసాన్‌ నిధులు రైతుల ఖాతాల్లో పడుతున్నాయన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులను అనుసరించి రైతులు లాభాల బాటలో ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం పోగ్రాం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.రమేష్‌, వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధానాధికారి డాక్టర్‌ పి.సంధ్యారాణి, దర్శి ఏడీఏ బాలాజీనాయక్‌, శాస్త్రవేత్తలు టి.వెంకటేశ్వరరెడ్డి, మా నస, లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ముమ్మరంగా రైతు విశిష్ట సంఖ్య నమోదు కార్యక్రమం

దొనకొండ : జిల్లావ్యాప్తం గా అన్నీ మండలాల్లో రెండు మూడు సమీప గ్రామా లను కలిపి ఫార్మర్‌ ఐడీలపై క్యాంపులు ఏర్పాటుచేసి నట్టు జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్‌ .శ్రీనివాస రావు తెలిపారు. సోమవారం మండలంలోని ఆరవళ్లిపా డు రైతుసేవా కేంద్రంలో ఏర్పాటుచేసిన క్యాంపును సం దర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సా గు పొలం ఉన్న ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య ను గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా అందిస్తున్న ట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్‌, రాష్ట్రప్రభుత్వం ఇవ్వబోయే అన్నదాత సుఖీభవ, రాయి తీ విత్తనాలు, సున్నావడ్డీ పంట రుణాలు తదితర వా టికి ఇప్పుడు ఇచ్చే విశిష్ట సంఖ్య తప్పనిసరి అన్నారు. ప్రస్తుతం రైతుల పట్టా పొలాలకు మాత్రమే సర్వర్‌ అ నుమతిస్తుందని చెప్పారు. అసైన్‌మెంట్‌, ఈనామ్‌, దేవ దాయ భూములకు తర్వాత అవకాశం కలుగుతుం దన్నారు. కార్యక్రమంలో దర్శి వ్యవసాయ సహాయ సంచా లకులు బాలాజీనాయక్‌, సాంకేతిక వ్యవసాయాధికారి శ్రీనివాస నాయక్‌, మండల వ్యవసాయాధికారి లక్ష్మీనారా యణ, టీడీపీ మండల అఽ ద్యక్షుడు శివకోటేశ్వరరావు, తదితరు పాల్గొన్నారు.

తూర్పుగంగవరంలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

తాళ్లూరు : ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతులు తమ పంటలను అమ్ముకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్‌. శ్రీనివాసరావు అన్నారు. నాగంబొట్లపాలెం సహకారపరపతి సంఘం ఆధ్వర్యంలో తూర్పుగంగవరంలో ఏర్పా టుచేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రా రంభించారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడు తూ ప్రభుత్వం కందులకు మద్దతు ధర క్వింటా రూ. 7550 ప్రకటించిందన్నారు. బహిరంగ మార్కెట్‌లో ఇం తకన్నా ఎక్కువ ధర వస్తే అమ్ముకోవచ్చునని చెప్పారు. ఏపీ మార్కెఫెడ్‌, నాఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే కందులు కొనుగోలు చేస్తారన్నారు. మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాల మేరకు కం దులు ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో టెక్నికల్‌ ఏవో శ్రీనివాసనాయక్‌, సొసైటీ సీఈవో శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 11:20 PM