Share News

దేవదాయ స్థలంపై వివాదం

ABN , Publish Date - Feb 03 , 2025 | 01:08 AM

దేవదాయ స్థలంలో మరోసారి వివాదం చోటు చేసుకుంది. దాన్ని కోనుగోలు చేశామని, అందు కు సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉ న్నాయని ఓ మహిళ నిర్మాణాలు చేపట్టగా, రో డ్డు స్థలాన్ని ఆక్రమించిందని కొంతమంది స్థా నికులు తెల్లవారుజూమున ఘర్షణకు దిగి ని ర్మాణాన్ని పాక్షికంగా పగలకొట్టారు.

 దేవదాయ స్థలంపై వివాదం

కొనుగోలు చేశానని నిర్మాణాలను ప్రారంభించిన మహిళ

నిబంధనలను ఉల్లఘించడంతో నిర్మాణాన్ని కూల్చి వేసిన అధికారులు

నిరాహార దీక్షకు దిగిన వైనం

సొమ్మసిల్లడంతో ఆస్పత్రికి తరలింపు

సింగరాయకొండ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): దేవదాయ స్థలంలో మరోసారి వివాదం చోటు చేసుకుంది. దాన్ని కోనుగోలు చేశామని, అందు కు సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉ న్నాయని ఓ మహిళ నిర్మాణాలు చేపట్టగా, రో డ్డు స్థలాన్ని ఆక్రమించిందని కొంతమంది స్థా నికులు తెల్లవారుజూమున ఘర్షణకు దిగి ని ర్మాణాన్ని పాక్షికంగా పగలకొట్టారు. సింగరాయ కొండ ప్రధాన రహదారి పక్కన 605-ఏ సర్వే నెంబర్‌లో పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన 3 సెం ట్ల స్థలం ఉంది. దాన్ని సింగరాయకొండకు చెం దిన ఓ మహిళ ఒక వ్యక్తి వద్ద కొనుగోలు చేసిం ది. అందులో నెల రోజుల క్రితం నుంచి రేకుల తో గదుల నిర్మాణానికి ఉపక్రమించారు. అప్పటి నుంచి తరచూ స్థానికులు కొంతమంది రోడ్డు స్థ లాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని ఆమెతో ఘర్షణకు దిగుతున్నారు. ఈ తరుణంలో ఆదివారం తెల్లవారుజూమున కొంత మంది వ్యక్తులు గడ్డపలుగులతో నిర్మాణాన్ని ధ్వంసం చేశారు.

రూ.50లక్షలు పెట్టి కోనుగోలు చేశా...

రూ.50 లక్షలకు తాను స్థలం కొనుగోలు చేశా నని, కొంత మంది వ్యక్తులు కావాలనే దారి ఆక్ర మించానని తరచూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసిం ది. నిర్మాణం చేస్తున్న గదులను రాత్రికిరాత్రికే కొంతమంది రౌడీ మూకలు ఽధ్వంసం చేశారని బోరున విలపించింది. సమస్యను పోలీసులు, అధికారులు తనకు ఎటువంటి న్యాయం చేయ ట్లేదని కావున తను చనిపోవడానికి అనుమతిని ఇవ్వాలని విలపించింది. అనంతరం నిరాహర దీక్షకు దిగింది. అక్కడే నీరసించి పడిపోవడంతో స్థానికులు 108 ద్వారా రిమ్స్‌కు తరలించారు.

ఉత్తర్వులు ఉల్లఘించినందునే..

ఆ స్థలం వివాదంలో ఉన్నందున ఇరువర్గా ల వారికి గత నెల 21వ తేదీన తహసీల్దార్‌ రవి ఎవరూ అందులో ప్రవేశించొద్దని, నిర్మాణం చేప ట్టవద్దని నోటీసులు జారీ చేశారు. ఆ ఉత్తర్వు లను ఉల్లఘించి నిర్మాణాలు చేపడుతున్నందున ఆదివారం సాయంత్రం రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు.

Updated Date - Feb 03 , 2025 | 01:08 AM