ఉత్తమ ఎన్నికల పురస్కారం అందుకున్న సీఐ
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:38 PM
రాష్ట్రంలో జరిగిన 2024 ఎన్నికలలో సమర్థవంతంగా పనిచేసిన సీఐ సూర్యనారాయణకు ఉత్తమ ఎన్నికల పురస్కారం లభించింది.

అభినందించిన ఎస్పీ దామోదర్
ఒంగోలుక్రైం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో జరిగిన 2024 ఎన్నికలలో సమర్థవంతంగా పనిచేసిన సీఐ సూర్యనారాయణకు ఉత్తమ ఎన్నికల పురస్కారం లభించింది. శనివారం విజయవాడలో ఓటర్లు దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అడ్మినిస్ర్టేషన్ డైరెక్టర్ నిమ్మగడ్డ రమే్‌షకుమార్ సమక్షంలో సీయస్ విజయానంద్ చేతుల మీదుగా సూర్యనారాయణ రూ.15 వేలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఎక్సలెన్స్ ఇన్ కండక్టిగ్ ఎలక్షన్స్, సెక్యూరిటీ మేనేజమెంట్ అవార్డు అందుకున్న సూర్యనారయణను ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందిచారు.