అంధులు అన్ని రంగాల్లో రాణించాలి
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:58 AM
అంధులు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. లూయీబ్రెయిలీ జయంతి సందర్భంగా ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం స్కూలులో శుక్రవారం నిర్వహించిన క్రీడాపోటీలలో అంధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కలెక్టర్ తమీమ్ అన్సారియా
బ్రెయిలీ జయంతి సందర్భంగా ఆటల పోటీలు
ఒంగోలు కార్పొరేషన్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : అంధులు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. లూయీబ్రెయిలీ జయంతి సందర్భంగా ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం స్కూలులో శుక్రవారం నిర్వహించిన క్రీడాపోటీలలో అంధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంధులు తమకు వైకల్యం ఉందని నిరాశ చెందకుండా, ఆత్మవిశ్వాసంతో అన్నింటా రాణించాలని చెప్పారు. బ్రెయిలీ రూపొందించిన లిపి నేడు అనేక మందికి వరంగా మారిందన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రాణిస్తూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న వారు భవిష్యత్‌లో మరింతగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల డీడీ జి.అర్చన, జడ్పీ సీఈవో చిరంజీవి, మెప్మా, డీఆర్‌డీఏ పీడీ రవికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్‌నాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి అంజల పాల్గొన్నారు.