Share News

బీజేపీ బలమైన శక్తిగా ఎదగాలి

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:09 AM

జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదిగేందుకు పాటుపడాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పిలుపునిచ్చారు. అందుకోసం తనవంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. స్థానిక ఓ కల్యాణ మండపంలో శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు శెగ్గెం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారోత్సవ సభలో మంత్రి ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు.

బీజేపీ బలమైన శక్తిగా ఎదగాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారోత్సవ సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యం

కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

ఒంగోలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదిగేందుకు పాటుపడాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పిలుపునిచ్చారు. అందుకోసం తనవంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. స్థానిక ఓ కల్యాణ మండపంలో శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు శెగ్గెం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారోత్సవ సభలో మంత్రి ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసే వారికి ఏదో ఒక రోజు గుర్తింపు లభిస్తుందన్నారు. తాను 1991లో కార్యకర్తగా చేరానని, ఆ రోజు నుంచి నేటి వరకు పార్టీలో అనేక పదవులు వచ్చాయన్నారు. ఇప్పుడు కేంద్ర కేబినెట్‌లో సహాయ మంత్రిగా అవకాశం లభించిందన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ కూడా ఒక సామాన్య కార్యకర్త నుంచే ఆ స్థాయికి చేరుకున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్‌ మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి మంచి పట్టు ఉందన్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన శ్రీనివాసరావు నేతృత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా శ్రేణులంతా పనిచేయా లన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేసిన శెగ్గం శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో అందరి సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటానన్నారు. నాయకులు, కార్య కర్తలను సమన్వయం చేసుకొని ముందుకెళ్తా నని తెలిపారు. బీజేపీ నాయకుడు శివాజీ అధ్య క్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్‌ నిడమానూరి కల్యాణ్‌ చక్రవర్తి, పీవీ శివారెడ్డి, శిరిసనగండ్ల శ్రీనివాసరావు, పీవీ కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, శాసనాల సరోజిని, యోగయ్యయాదవ్‌, విజయలక్ష్మి, బొద్దులూరి ఆంజనేయులు, తోగంటి శ్రీనివాస్‌చౌదరి, నాగేశ్వరరావు, బాపట్ల జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు పాల్గొన్నారు. అనంతరం మండల స్థాయి నూతన అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ విధానాలపై దిశానిర్దేశం చేశారు.

Updated Date - Feb 15 , 2025 | 01:09 AM