Share News

జీజీహెచ్‌లో మెరుగైన సేవలు

ABN , Publish Date - Feb 13 , 2025 | 02:03 AM

సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లోని అత్యవసర వైద్యసేవల విభాగంలో లోపాలను గుర్తించామని, వాటిని సరిదిద్దడంతోపాటు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.జమున తెలిపారు. అందుకు సంబంధించిన అన్ని విభాగాల హెచ్‌వోడీలు, ీఆర్‌ఎంవోతో ఆమె సమీక్ష నిర్వహించారు.

జీజీహెచ్‌లో మెరుగైన సేవలు

వైద్యులు సమన్వయంతో పనిచేయాలి

సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జమున

ఒంగోలు కార్పొరేషన్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లోని అత్యవసర వైద్యసేవల విభాగంలో లోపాలను గుర్తించామని, వాటిని సరిదిద్దడంతోపాటు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.జమున తెలిపారు. అందుకు సంబంధించిన అన్ని విభాగాల హెచ్‌వోడీలు, ీఆర్‌ఎంవోతో ఆమె సమీక్ష నిర్వహించారు. క్యాజువాలిటీ వైద్యసేవలపై ‘జీజీహెచ్‌కు జబ్బు’ శీర్షికన బుధవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. వైద్యాధికారులతో సమావేశంలో పలు సూచనలు చేశారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. సేవల్లో ఎలాంటి విమర్శలు, ఫిర్యాదులు రాకూడదన్నారు. ఇకపై క్యాజువాలి టీలో విధులు నిర్వర్తించే డాక్టర్లు, స్పెషలిస్ట్‌లు, నర్సింగ్‌, ఇతర సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు. అలాగే వారికి నిర్దేశించిన సమయంలో పూర్తిస్థాయిలో విధుల్లో ఉండాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Updated Date - Feb 13 , 2025 | 02:03 AM