Share News

మెరుగైన సేవలందించాలి

ABN , Publish Date - Jan 16 , 2025 | 10:46 PM

శాఖ ఏదైనా సంబంధిత అధికారులు ప్ర జలకు మెరుగైన సేవలందించాలి. తద్వా రా మెప్పు పొందుతూ ప్రభుత్వానికి మం చిపేరు తేవాలని ఎమ్మెల్యే ఎంఎం కొండ య్య చెప్పారు. ఆయన ఆర్డీవో కార్యాలయంలో గురువారం ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడుతో కలసి నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ పేదలకు నివేశన స్థలాలు పంపిణీ చేసేందుకు నియోజకవర్గ పరిధిలో ఉన్న వనరులపై చర్చించారు.

మెరుగైన సేవలందించాలి
రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే కొండయ్య

ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : శాఖ ఏదైనా సంబంధిత అధికారులు ప్ర జలకు మెరుగైన సేవలందించాలి. తద్వా రా మెప్పు పొందుతూ ప్రభుత్వానికి మం చిపేరు తేవాలని ఎమ్మెల్యే ఎంఎం కొండ య్య చెప్పారు. ఆయన ఆర్డీవో కార్యాలయంలో గురువారం ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడుతో కలసి నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ పేదలకు నివేశన స్థలాలు పంపిణీ చేసేందుకు నియోజకవర్గ పరిధిలో ఉన్న వనరులపై చర్చించారు. అందుకు సంబంఽధించి ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. పొజిషన్‌ స ర్టిఫికెట్లకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణతో పని చేయాలన్నారు. సబ్‌ప్లాన్‌కు సంబంధించి అర్హులైన వారికి కులధ్రువీకరణ పత్రాలు నిర్ణీత కాలవ్యవధిలో మం జూరు చేయాలని చెప్పారు. అక్రమ ఇసు క, అనధికారిక లేఅవుట్లకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తగిన చర్య లు తీసుకోవాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఏమన్నా ఆటంకాలు ఎదురైతే ప్రభుత్వపరంగా అండగా ఉంటామని చెప్పారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ అబ్దుల్‌ రషీద్‌, చీరాల, వేటపాలెం మండలా తహసీల్దార్లు గోపికృష్ణ, పార్వ తి, మెప్మా సీఎంఎం కొండయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 10:46 PM