ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:41 PM
ప్రభుత్వా సుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. గురు వారం స్థానిక ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా రక్తపరీక్ష, డయాల సిస్ కేంద్రాలను పరిశీలించారు. ఆసుపత్రికి వ చ్చిన రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవల పై విచారించారు.

ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వా సుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. గురు వారం స్థానిక ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా రక్తపరీక్ష, డయాల సిస్ కేంద్రాలను పరిశీలించారు. ఆసుపత్రికి వ చ్చిన రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవల పై విచారించారు. డయాలిసిస్ కేంద్రంలో వైద్యం పొందుతున్న కిడ్నీ బాధితులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ అధునాతన పరికరాల ద్వారా కిడ్నీ బాధితులకు వైద్య సేవలు అందించాలన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వా సుపత్రి సేవలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆసుపత్రిలో ప్రభుత్వ, ప్రయి వేటు భాగస్వామ్యంతో మెరుగైన వైద్య సేవలు అందిం చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దాతల సహకారంతో ఆరు నెలల వ్యవధిలో ప్రయివేటు ఆసుప త్రుల తరహాలో వైద్య సేవలు అందించేలా చర్యలు తీ సుకుంటున్నట్లు తెలిపారు. రోగులకు ఎలాంటి అసౌక ర్యం లేకుండా నాణ్యమైన వైద్యం అందించే ప్రక్రియలో తమ పార్టీ శ్రేణులు వలంటీర్లుగా వ్యవహరిస్తారన్నారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు వైద్యులకు అనుసంధాన కర్తలుగా ఉంటూ మెరుగైన వైద్యం అందేలా సేవలు అందించాలని మాజీ కౌన్సిలర్, ఆసు పత్రి హెచ్‌డీఎస్ కమిటీ సభ్యులు బుల్లా బాలబాబుకి సూచించారు. ఎప్ప టికప్పుడు ఆసుపత్రి వైద్యంపై వివరా లు తెలియజేయాలని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రిలో కాన్పుల విభాగంలో కార్పొరేట్ ఆసుపత్రి కంటే మిన్నగా పరికరాలు, మిషనరీ, సామగ్రి సమకూ ర్చినట్లు డాక్టర్ ఉగ్ర తెలిపారు.
గైనకాలజిస్ట్‌ను కూడా నియమించి నట్టు చెప్పారు. వారు అత్యుత్తమ వైద్యసేవలు అందించటంతో పాటు కాన్పులతో పాటు, ఆపరేషన్‌లు చేయటం జరుగుతుంద న్నారు. లక్షలు ఖర్చు చేసి ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వాసుపత్రిలో అందుతున్న మెరుగైన, ఉచిత వైద్యసేవలు పొందాలని డాక్టర్ ఉగ్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బయ్య, డాక్టర్ తిరుపతిరెడ్డి, వైద్యసిబ్బంది పాల్గొ న్నారు.