ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:39 PM
నిబంధనలకు లోబడి లే అవుట్లు వేయాలని ఆర్డీవో కేశ వర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అక్రమ లేఅవుట్ల నియం త్రణ, సమన్వయ కమిటీ సమావే శంలో ఆయన మాట్లాడారు. గతంలో కనిగిరి నియోజకవర్గంలో అసైన్డ్ భూముల్లో వేసిన అక్రమ వెంచర్లను తొలగించి స్వాధీనం చేసుకుంటున్నట్టు చెప్పారు. వాటిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించటం జరుగుతుందన్నారు.

ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి
కనిగిరి, జనవరి 16 (ఆంధ్ర జ్యోతి): నిబంధనలకు లోబడి లే అవుట్లు వేయాలని ఆర్డీవో కేశ వర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అక్రమ లేఅవుట్ల నియం త్రణ, సమన్వయ కమిటీ సమావే శంలో ఆయన మాట్లాడారు. గతంలో కనిగిరి నియోజకవర్గంలో అసైన్డ్ భూముల్లో వేసిన అక్రమ వెంచర్లను తొలగించి స్వాధీనం చేసుకుంటున్నట్టు చెప్పారు. వాటిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించటం జరుగుతుందన్నారు. ప్రస్తుతం లే అవుట్లు వేయదలచినవారు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలన్నారు. నిబంధనల మేరకు వెంచర్లు వేసేవారికి ప్రభుత్వం ద్వారా ఆయా లేఅవుట్లో వివిధ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కనిగిరి పట్టణ పరిధిలో వేసే వెంచర్లకు అనుమతులను మున్సిపల్‌శా ఖ నుంచి మాత్రమే పొందాలన్నారు. ఐదు అంతస్థుల ఇళ్ళ నిర్మాణాల అనుమతులు కూడా ఇకనుంచి కనిగిరి పట్టణంలోని మున్సిపల్‌శాఖ నుంచి అనుమతి పొందే అవకాశం ప్రభుత్వం కల్పిస్తూ జీవో ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహ రిస్తూ వెంచర్లను వేసే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో కనిగిరి, సీఎస్‌పురం తహసీల్దార్‌లు రవిశంకర్, మం జునాధరెడ్డి, మున్సిపల్ కమిషనర్ జోసఫ్ డానియేల్, టీపీవో సువర్ణకుమార్, సబ్‌రిజిస్ర్టార్ వాసుదేవరెడ్డి, ఉడా అధికారులు శారదాదేవి, పృద్వీరాజ్ పాల్గొన్నారు.
అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి
ప్రభుత్వాధికారులు బాధ్యతాయుతంగా పనిచేయా లని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన లేఅవుట్ల అనుమతులు మంజూరు సమన్వయకమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కనిగిరి ప్రాంతంలో అక్రమంగా వేసిన లే అవుట్లను గుర్తించాలని సూచించారు. గతంలో కనిగిరి లో వేసిన వెంచర్లను పరిశీలించాలన్నారు. ఫీల్డ్‌లో ఆ యా వెంచర్లు ఏఏ సర్వే నెంబర్లలో ఉన్నాయో గుర్తించి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. బాధ్యతారాహి త్యంగా పనిచేసేవారు బదిలీపై వెళ్ళిపోవచ్చని తెలిపా రు. లేకుంటే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకవెళ్ళి శాఖా పరంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చురక లంటించారు. సమావేశంలో రెవెన్యూ, రిజిస్ట్రార్, మున్సి పల్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.