వైద్యరంగంలోని మార్పులపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:15 AM
వైద్యరంగంలో వస్తున్న ఆధునిక మా ర్పులపై అవగాహన పెంచుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రోగామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసప్రసాద్ పేర్కొన్నారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసప్రసాద్
ఒంగోలు కార్పొరేషన్, ఫిబ్రవరి 23 (ఆంధ్ర జ్యోతి): వైద్యరంగంలో వస్తున్న ఆధునిక మా ర్పులపై అవగాహన పెంచుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రోగామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసప్రసాద్ పేర్కొన్నారు. ఆదివా రం ఒంగోలులోని రిమ్స్ వైద్యకళాశాలలో జ రిగిన డెర్మటాలజీ విభాగం జోనల్ వర్క్‌షాప్ కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుఖ వ్యాధులు, హెచ్‌ఐవీ చికిత్స, నివారణలో వ స్తున్న నూతన ఆవిష్కరణలు, విధానాలపట్ల వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన కలి గి ఉండాలన్నారు. వైద్యులు నిరంతర అధ్య యనం ద్వారా మెలకువలు నేర్చుకుని రాణిం చాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే పరిశోధనలపట్ల ఆసక్తి కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు, జీజీహెచ్ సూపరింటెం డెంట్ డాక్టర్ జమున, కాటూరి మెడికల్ కాలే జీ ప్రొఫెసర్ డాక్టర్ నాగేశ్వరమ్మ, సిద్ధార్ధ మెడి కల్ కాలేజి ప్రొఫెసర్ ఆలిమ్స్, విశ్వభారతి వై ద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి.ఉదయ్‌కు మార్, రిమ్స్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు, జీజీ హెచ్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.