పరిసరాల పరిశుభ్రతపై అవగాహన అవసరం
ABN , Publish Date - Feb 16 , 2025 | 12:33 AM
స్వచ్ఛాంధ్ర సా ధనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఈ కార్యక్రమంలో ప్ర జలు కూడా భాగస్వాములై పరిసరాల పరిశుభ్రతపై అ వగాహన పెంచుకోవాలని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు.
మంత్రి డాక్టర్ స్వామి
కలెక్టర్ అన్సారియాతో కలిసి ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపనలు
కొండపి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : స్వచ్ఛాంధ్ర సా ధనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఈ కార్యక్రమంలో ప్ర జలు కూడా భాగస్వాములై పరిసరాల పరిశుభ్రతపై అ వగాహన పెంచుకోవాలని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. రాష్ట్ర వ్యాప్త ప్రారంభ కార్యక్రమంలో భాగంగా శనివారం పెదకండ్లగుంట గ్రామ పం చాయతీలోని జాళ్లపాలెంలో కలెక్టర్ తమీమ్ అన్సారి యా, అధికారులతో మంత్రి కలిసి ఇంకుడు గుంతల ని ర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ అపరిశుభ్రత వల్ల రోగాలు ప్రబలుతున్నాయన్న విషయం తెలుసుకోవాలన్నారు. ఇళ్లలోని నీరు రోడ్లపైకి చేరి దోమలు వృద్ధి చెంది ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం జాళ్లపాలేనికి తొలివిడతలో 150 ఇంకుడు గుంతలు మం జూరు చేసిందన్నారు. వీటి తవ్వకం వల్ల నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరగడంతోపాటు పరిసరా లు పరిశుభ్రంగా ఉంటాయని తెలిపారు. ప్రజలు భాగస్వాములై, ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికీ నిర్మించుకోవాలని చెప్పారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ గ్రామాలు స్వచ్ఛంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. జాళ్లపాలెం జిల్లాకే ఆదర్శంగా నిలవాలన్నారు.
రోడ్లు ఊడ్చి స్ఫూర్తి నింపిన మంత్రి, కలెక్టర్
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి స్వామి, కలెక్టర్ అన్సారియా జాళ్లపాలెంలోని పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లను ఊడ్చి గ్రామస్థులలో స్ఫూర్తిని నిం పారు. గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. పలు ఇళ్ల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమిపూజ చేసి, ఇం కుడు గుంతల్లో మట్టిపోశారు. రెండు డ్వాక్రా సంఘాలకు మూడు లక్షల రూపాయల చొప్పున మంజూరైన చెక్‌లను అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ గొర్రెపాటి రామయ్యచౌదరి, డ్వామా పీడీ జోసె్‌ఫకుమార్, డీపీవో జి.వెంకటనాయుడు, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, జడ్పీ సీఈవో చిరంజీవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్‌నాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాలశంకర్‌రావు, డీఎల్‌పీవో పద్మ, ఎంపీడీవో రామాంజనేయులు, తహసీల్దార్ పి. మురళి, పెద్దకండ్లగుంట మాజీ సర్పంచ్ తానికొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.