పార్టీ ఏదైనా.. పాగా మాదే!
ABN , Publish Date - Feb 18 , 2025 | 01:32 AM
మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల పర్వం జోరుగా సాగుతోంది. ఇప్పటికే వందల ఎకరాలు పరులపాలైంది. రూ.కోట్ల విలువచేసే భూముల్లో పాగా వేసిన కబ్జారాయుళ్లు వాటిలో యథేచ్ఛగా పంటలు సాగు చేస్తున్నారు. కొందరు దర్జాగా బోర్లు సైతం వేశారు.
ఆక్రమణల చెరలో ప్రభుత్వ భూములు
తాళ్లూరు మండలంలో వందల ఎకరాలు పరులపరం
పట్టించుకోని అధికారులు
తాళ్లూరు, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల పర్వం జోరుగా సాగుతోంది. ఇప్పటికే వందల ఎకరాలు పరులపాలైంది. రూ.కోట్ల విలువచేసే భూముల్లో పాగా వేసిన కబ్జారాయుళ్లు వాటిలో యథేచ్ఛగా పంటలు సాగు చేస్తున్నారు. కొందరు దర్జాగా బోర్లు సైతం వేశారు. సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడం వీరికి ఊతం ఇస్తోంది. ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పంచన చేరి ఆక్రమిత భూములను అనుభవిస్తున్నారు. దేవుని మాన్యాలు, వాగు పోరంబోకు భూములను కూడా వదలడం లేదు. మండలంలోని గుంటిగంగ, నాగంబొట్లపాలెం, బొద్దికూరపాడు, మన్నేపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములను పోటీపడి ఆక్రమించుకున్నారు. ఆ భూముల విలువ రూ.కోట్లలో ఉంటుంది. రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్నా ఆక్రమణదారులు మాత్రం తమవిగా అభివృద్ధి చేసి సాగు చేసుకుంటూ ఫలాలు పొందుతున్నారు.
కొన్ని చోట్ల పంటల సాగు.. మరికొన్ని చోట్ల ప్లాట్లు
సోమవరప్పాడు గ్రామానికి చెందిన సుబ్బన్న చెరువుసర్వే నంబర్లు 324, 325, 326లలోని 61.24ఎకరాలు, ఆదేగ్రామంలో సర్వేనెంబర్336, 337, 322/1లలోని 23.72 ఎకరాలను ఆక్రమించారు. సొంతంగా బోర్లు వేసుకుని పంటలు, సుబాబుల్ వంటి పంటలు సాగు చేస్తున్నారు. దీనికితోడు వాగుపోరంబోకు భూమిసర్వే నంబర్ 336లో 6.36 ఎకరాలు, 339లో6.72ఎకరాలు, 337లో 5.82 ఎకరాల భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నారు. అదంతా రికార్డుల్లో చెరువుగా ఉంది. ఇదే గ్రామ రెవెన్యూ పరిధిలో తూర్పుగంగవరం-చీమకుర్తి ప్రధాన రోడ్డు మార్గంలో గల సర్వే నంబర్ 231/1,231/2లోని 2.36 ఎకరాల వాగు భూమిలో శాశ్వత భవనం, గేదెల షెడ్లు నిర్మించారు. కొంతస్థలంలో ప్లాట్లు వేసి అమ్మకానికి సిద్ధం చేశారు.
చెన్నకేశవస్వామి ఆలయ భూమి హాంఫట్
మన్నేపల్లి గ్రామంలో చెన్నకేశవస్వామికి చెందిన 63ఎకరాల భూములను దారంవారిపాలెం, విఠలాపురం, మన్నేపల్లి గ్రామాలకు చెందిన ఆక్రమణదారులు సాగు చేస్తున్నారు. చెన్నకేశవ స్వామికి చెందిన సర్వే నంబర్లు 130/1లో 6.02ఎకరాలు, 134లో 12.10ఎకరాలు, 457/1లో14.46 ఎకరాలు, 545లో 16.92 ఎకరాలు, 621/1లో 10.90 ఎకరాలు, 621/3లో0.63, 675/5లో 0.96 ఎకరాలతోపాటు మన్నేపల్లి చెన్నకేశవస్వామికి చెందిన భూములు కూడా అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పటికి రెవెన్యూ రికార్డుల్లో చెన్నకేశవస్వామి పేరిటనే ఆ భూములు ఉన్నాయి. బొద్దికూరపాడు గ్రామానికి చెందిన చెరువులో దాదాపు 30 ఎకరాలు ఆక్రమణకు గురైంది. నాగంబొట్లపాలెం గ్రామంలో 675/5 లోని అటవీ భూములు, రెవెన్యూశాఖకు చెందిన పాపిరెడ్డికుంట, రామయ్య కుంటలో దాదాపు 14ఎకరాల భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నారు.
విచారించి చర్యలు తీసుకుంటాం
జె.ఇమ్మానియేల్‌రాజు, ఇన్‌చార్జ్ తహసీల్దార్, తాళ్లూరు
ప్రభుత్వ భూములు ఆక్రమణలు జరిగిన గ్రామాల్లో విచారణ చేయిస్తాం. ఆ నివేదికలను జిల్లా యంత్రాంగానికి అందజేస్తాం. వారి సూచన మేరకు ఆక్రమణదారులపై చర్యలు తీసకుంటాం. నొప్పులు అధికమవడంతోపాటు మూడుసార్లు గుండెపోటుకు గురైనట్లు సమాచారం. మరోవైపు వైద్యసేవలు పొందుతూనే ఆమె కోమాలోకి వెళ్లడంతో వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేశారు. అయినా ఆమె ఆదివారం సాయంత్రం మృతి చెందారు.