వైసీపీకి మరోసారి భారీ షాక్..!
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:06 AM
ఒంగోలులో వైసీపీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 20 మంది కార్పొరేటర్లు జనసేనలోకి జంప్ అయ్యారు. వారంతా మంగళవారం మాజీ మం త్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం సమక్షంలో జనసేనలో చేరారు. వారికి పవన్ కల్యాణ్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

20మంది కార్పొరేటర్లు జనసేనలోకి జంప్
బాలినేనితో కలిసి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సమక్షంలో చేరిక
6 నుంచి 46కు చేరిన కూటమి సభ్యుల బలం
ఒంగోలు కార్పొరేషన్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఒంగోలులో వైసీపీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 20 మంది కార్పొరేటర్లు జనసేనలోకి జంప్ అయ్యారు. వారంతా మంగళవారం మాజీ మం త్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం సమక్షంలో జనసేనలో చేరారు. వారికి పవన్ కల్యాణ్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఒంగోలు కార్పొరేషన్‌లో టీడీపీ కూటమి బలం46కు చేరుకోగా, వైసీపీ నలుగురికి పరిమితమైంది.
46కు పెరిగిన కూటమి బలం
ఒంగోలు కార్పొరేషన్‌గా ఏర్పాటైన తర్వాత తొలి పా లకవర్గం 2021 మార్చి 18న ఎన్నికైంది. అప్పట్లో వైసీపీ 43 డివిజన్లలో గెలుపొందగా, తెలుగుదేశం పార్టీ ఆరు డివిజన్లలో గెలుపొందింది. ఒక డివిజన్‌లో జనసేన వి జయం సాధించింది. 43మంది సభ్యులతో మేయర్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. మూడేళ్లపాటు వైసీపీ ఆధికారంలో పాలన సాగింది. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఊ హించని విజయం సాధించడంతో మేయర్ గంగాడ సుజాతతోపాటు, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి మరో 16మంది సభ్యులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో ఏడుగురుగా ఉన్న కూటమి సభ్యుల సంఖ్య 25కు చేరుకుంది. ఎంపీ మా గుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ద న్, బీఎన్.విజయ్‌కుమార్‌లు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉండటంతో కూటమి బలం 28కి పెరిగింది. దీంతోఅ ధికారం కూటమి చేతిలోకి వెళ్లింది. దీంతో అప్పటి ను ంచిటీడీపీ కూటమి సభ్యులు26 మంది, వైసీపీ స భ్యులు 24మందితో కౌన్సిల్ సమావేశాలు నడుస్తున్నా యి. తాజా పరిణామాలతో వైసీపీకి చెందిన 20 మం ది జనసేనలో చేరడంతో కూటమి సభ్యుల సంఖ్య 6 నుంచి 46కు పెరిగింది.
వైసీపీలో నలుగురు..
ప్రస్తుతం 11వ డివిజన్ కార్పొరేటర్ గంగవరపు ప్ర వీణ్‌కుమార్, 14 డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇమ్రాన్‌ఖా న్, 41వ డివిజన్ కార్పొరేటర్ కత్తినేని వెంకట మహాలక్ష్మి, ఇండిపెండెంట్‌గా గెలిచి వైసీపీలో చేరిన 45వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస కుమారివైసీపీలో నే కొనసాగుతున్నారు. వారితోపాటు కోఆప్షన్ సభ్యులు స్వర్ణ శ్యామ్‌సాగర్, షేక్ రషీదానాగూర్, మహ్మద్ సర తాజులు కూడా వైసీపీలోనే ఉన్నారు.
జనసేనలో చేరిన కార్పొరేటర్లు వీరే..
కోటపూరి సామ్రాజ్యం (1 డివిజన్), గుండు ధన లక్ష్మి(3), ఎందేటి పద్మావతి(5), చల్లా తిరుమల రావు (6), వెన్నపూస శోభరాణి(9), ఈదర వెంకట సురేష్ బాబు(19), యనమల నాగరాజు(21), కారంశెట్టి పుష్ప లత(22), షేక్ ఇంతియాజ్(23), జడ వెంకటేష్(27), నీలంరాజు సరోజని(28), షేక్ ఫాతిమా(29), కాశీ మ హంతి చంద్రకళ(30), తన్నీరు నాగజ్యోతి(31), తాడి కృష్ణలత(32), వెలనాటి మాధవరావు (డిప్యూటీ మేయ ర్)(34), ఢాకా సుజాత(36), గోలి లక్ష్మి కోటేశ్వరమ్మ (39), నూకతోటి మస్తానమ్మ(42), గోపిరెడ్డి గోపాల్ రెడ్డి(44), అలాగే కోప్షన్ సభ్యులు వర్ధు శేషయ్య, మ హ్మద్ షేక్‌ఆలీ చేరిన వారిలో ఉన్నారు.