Share News

అంగన్‌వాడీలకు గ్రాడ్యుటీపై హర్షం

ABN , Publish Date - Mar 08 , 2025 | 11:45 PM

అంగన్‌వాడీలకు గ్రాడ్యూటి వర్తింపచేస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేయడం పట్ల తెలుగునాడు అంగన్‌వాడీ ట్రెడ్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు గడ్డం అనంతలక్ష్మి అన్నారు. శనివారం మార్కాపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర కమిటీ సభ్యులు కలిశారు. థ్యాంక్యూ సీఎం సార్‌ అం టూ ప్లకార్డులతో కృతజ్ఞతలు తెలిపారు.

అంగన్‌వాడీలకు గ్రాడ్యుటీపై హర్షం
సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న తెలుగునాడు అంగన్‌వాడీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు

అద్దంకిటౌన్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : అంగన్‌వాడీలకు గ్రాడ్యూటి వర్తింపచేస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేయడం పట్ల తెలుగునాడు అంగన్‌వాడీ ట్రెడ్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు గడ్డం అనంతలక్ష్మి అన్నారు. శనివారం మార్కాపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర కమిటీ సభ్యులు కలిశారు. థ్యాంక్యూ సీఎం సార్‌ అం టూ ప్లకార్డులతో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్ర మంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి లక్ష్మీనరసమ్మ, కోశాధికారి హేమలత, కాత్యాయని, సామ్రాజ్యం ఉన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 11:45 PM