మేళతాళాలతో అమ్మవారి గ్రామోత్సవం
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:50 PM
మండలంలోని చందలూరు గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి పాలవెళ్లి మహోత్సవం తొమ్మిదవ రోజు శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మేళతాళాలతో సాగిన అమ్మవారి గ్రామోత్సవంలో వేలాది మంది భక్తులు అమ్మవారికి అభిముఖంగా వెనుకకు నడుస్తూ పూలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్నారు.

వేలాదిగా పాల్గొన్న భక్తులు
పూలతో పసుపు మయంగా పురవీధులు
పంగులూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని చందలూరు గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి పాలవెళ్లి మహోత్సవం తొమ్మిదవ రోజు శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మేళతాళాలతో సాగిన అమ్మవారి గ్రామోత్సవంలో వేలాది మంది భక్తులు అమ్మవారికి అభిముఖంగా వెనుకకు నడుస్తూ పూలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు భక్తి పారవశ్యంతో అమ్మవారికి సమర్పించిన పూలతో పురవీధులు పసుపు మయమాయ్యాయి. శుక్రరవారం తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాల మూలమంత్ర జపం చేసి 11 మంది ముత్తయిదువులకు పూలు, గంధం, కుంకుమలు అర్పించి బాలభోగం నిర్వహించారు. పొంగించిన పాలపై నెయ్యితో కలిపిన మధుర పదార్థం అమ్మవారికి నివేదన గావించి ముత్తయిదువులకు ఆ పధార్థాలను ఒడ్డించారు. అనంతరం ముత్తయిదువులు జల బిందెలతో పురవీధులలో అమ్మవారి గ్రామోత్సవం వెంట రాగా, మేళ తాళాలతో సాగిన ఈ గ్రామోత్సవంలో చందలూరు, పరిసర గ్రామాల ప్రజలు, బంధు మిత్రులు వేలాదిగా పాల్గొని అమ్మవారికి నమస్కరిస్తూ, పూలు చల్లుతూ సాగిన ఉత్సవం తిలకించేందుకు ప్రధాన రహదారికి ఇరువైపులా భక్తులు బారులుతీరారు. కిక్కిరిసిన జన సందోహంతో సాగిన గ్రామోత్సవం తిరునాళ్లను తలపించింది. అమ్మవారు పురంలో కొలువుదీరారు. రాత్రివేళ విద్యుత్ దీపాలతో రూపుదిద్దుకున్న ప్రభవతో పుల్లెల, తాటి వంశస్తులు పుర వీదులలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భరత నాట్యం, వీధి డ్యాన్స్‌లతో గ్రామంలో కోలాహలం నెలకుంది.