Share News

ఆ ముగ్గురూ నాటి అద్దంకి ఎస్‌ఐలే

ABN , Publish Date - Jan 16 , 2025 | 10:56 PM

గతంలో అద్దంకి ఎస్సై లుగా పనిచేసిన ముగ్గురు ప్రమోషన్‌లు పొంది ప్రస్తుతం చీరాల డీఎస్పీగా, అద్దంకిరూరల్‌, టౌన్‌ సీఐలుగా పనిచేయడం యాధృశ్ఛికంగా ఒకేసారి జరిగింది

ఆ ముగ్గురూ నాటి   అద్దంకి ఎస్‌ఐలే
చీరాల డీఎస్పీ మొయిన్‌, అద్దంకి రూరల్‌ సీఐ మల్లికార్జునరావు, అద్దంకిటౌన్‌ సీఐ సుబ్బరాజు

ఒకే సారి చీరాల డీఎస్పీగా, అద్దంకి రూరల్‌,

టౌన్‌ సీఐలుగా విధులు

అద్దంకి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : గతంలో అద్దంకి ఎస్సై లుగా పనిచేసిన ముగ్గురు ప్రమోషన్‌లు పొంది ప్రస్తుతం చీరాల డీఎస్పీగా, అద్దంకిరూరల్‌, టౌన్‌ సీఐలుగా పనిచేయడం యాధృశ్ఛికంగా ఒకేసారి జరిగింది. 2007 నుంచి 2010 వరకు మూడు సంవత్సరాల పాటు అద్దంకి ఎస్‌ఐగా పనిచేసిన మహ్మద్‌ మొయిన్‌ సీఐగా ప్రమోషన్‌పై నెల్లూరు జిల్లా కలిగిరి వెళ్లారు. అనంతరం పలు చోట్ల సీఐలుగా పనిచేసి డీఎస్పీగా ప్రమోషన్‌ పొందారు. ప్రస్తుతం చీరాల డీఎస్సీగా పనిచేస్తున్నారు. అద్దంకి ఎస్‌ఐగా 2010 ఆగస్టు నుంచి 2011 డిసెంబరు వరకు పనిచేసి ప్రమోషన్‌పై సీఐగా సీఐడీ విభాగానికి వెళ్లారు. వివిధ సర్కిళ్లలో పనిచేసి ప్రస్తుతం మేదరమెట్ల కేంద్రంగా ఉన్న అద్దంకి రూరల్‌ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అద్దంకి టౌన్‌ సీఐగా విధులలో చేరిన సుబ్బరాజు 2017 మే నుంచి 2019మే వరకు రెండు సంవత్సరాల పాటు అద్దంకి ఎస్సైగా విధులు నిర్వహించారు. అనంతరం వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో పనిచేసి సీఐగా ప్రమోషన్‌ పొంది నెల్లూరు జిల్లాలో పనిచేసి ప్రసుత్తం అద్దంకి టౌన్‌ సీఐగా వచ్చారు. ముగ్గురు అధికారులు అద్దంకి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైలుగా ఎక్కువ కాలం పనిచేసిన అధికారులు కావడంతో అద్దంకిపై పూర్తి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో మంచి పోలీసింగ్‌ చేసేందుకు ఎంతగానో దోహదపడుతుందని ప్రజలు భావిస్తున్నారు.

Updated Date - Jan 16 , 2025 | 10:56 PM