ప్రసవాలన్నీ ప్రభుత్వ వైద్యశాలల్లోనే జరగాలి
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:20 AM
ప్రజలకు ప్రఽభుత్వ పథకాలు, ప్రోత్సాహకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా చూడాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.విజయమ్మ అన్నారు. మంగళవారం అద్దంకిలోని గాజులపాలెం యూపీహెచ్‌సీని ఆమె సందర్శించారు.

పథకాలు, ప్రోత్సాహకాలను ప్రజలు తెలియజేయండి
డీఎంహెచ్‌వో డాక్టర్ విజయమ్మ
అద్దంకిటౌన్, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ప్రజలకు ప్రఽభుత్వ పథకాలు, ప్రోత్సాహకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా చూడాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.విజయమ్మ అన్నారు. మంగళవారం అద్దంకిలోని గాజులపాలెం యూపీహెచ్‌సీని ఆమె సందర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న సీడీ అండ్ ఎస్‌సీడీ 3.0 సర్వేని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో జరుగుతున్న ఆశా డే కార్యక్రమంలో ఆమె పాల్గొన్ని ఏఎన్‌ఎంలు, ఆశాలకు పలు సూచనలు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహరం అర్హులైన గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలన్నారు. పౌష్టికాహారం వలన తల్లికి, బిడ్డకు జరిగే ప్రయోజనాలను తల్లులకు వివరించాలన్నారు. గర్భిణులు ప్రసవాలకు ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్ల కుండా ప్రభుత్వ వెద్యశాలలో ఉండే సదుపాయాలు, సవతులు, పథకాల గురించి తెలియజేసి ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. ఎ క్కువ శాతం సాధారణ కాన్పులు అయ్యేలా చూడాలన్నారు. ప్రతి నెలా ఆయా వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. సీజనల్‌గా వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. డి వార్మింగ్ డే కార్యక్రమం సక్రమంగా జరగలేదని ప్రభుత్వానికి నివేదిక వెళ్లిందని, ఆ కార్యక్రమంపై రాష్ట్రం నుంచి పది బృందాలు విచారణ చేపట్టే అ వకాశం ఉందని, ఎక్కడా కార్యక్రమం సక్రమంగా జరగకపోయినా వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఈఎంవో మరియమ్మ, గాజులపాలెం, కాకానిపాలెం యూపీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్ గొట్టిపాటి జయసింహ, డాక్టర్ ఎం.హేమమాధురి, ఎంపీహెచ్‌ఈవో నాగేశ్వరరావు, సూపర్‌వైజర్ వీ వెంకాయమ్మ, ఏఎన్‌ఎంలు, ఆ శా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.