ఆలపాటికి ఘన విజయాన్ని అందించాలి
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:32 PM
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరచిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు తిరుగులేని విజయాన్ని అందించాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎన్నికల ప్రచారాన్ని శనివారం చీరాల వీఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కళాశాలలో నిర్వహించారు.

మాజీ మంత్రి ఆనందబాబు
చీరాలటౌన్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరచిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు తిరుగులేని విజయాన్ని అందించాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎన్నికల ప్రచారాన్ని శనివారం చీరాల వీఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కళాశాలలో నిర్వహించారు. ఈక్రమంలో ఉపాధ్యాయులు, ప్రైవేటు ఉపాధ్యాయులు, పట్టభద్రుల ప్రత్యేకంగా కలిసి ఓటును అభ్యర్థించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుపునకు సహకరించాలని కోరారు. అలాగే కార్యక్రమంలో హాజరయిన వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ను అందజేశారు.