Share News

పొగాకు, మిర్చి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:51 PM

జిల్లాలో విస్తారంగా సాగు చేసిన పొగాకు, మార్చి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు డిమాండ్‌ చేశారు.

పొగాకు, మిర్చి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి

రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రావు

ఒంగోలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విస్తారంగా సాగు చేసిన పొగాకు, మార్చి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు డిమాండ్‌ చేశారు. స్థానిక ప్ర జాసంఘాల కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది ధరలు బాగుండటంతో చిన్న, సన్నకారు రైతులు విస్తారంగా బర్లి పొగాకును సాగు చేశారన్నారు. ప్రస్తుతం బర్లి పొగాకును సక్రమంగా కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు అప్పుల పాల య్యే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ప్రభు త్వం జోక్యం చేసుకొని బోర్డు ద్వారా క్వింటా రూ. 15వేలకు తగ్గకుండా కొనుగోలు చేసేలా చూడా లని చెప్పారు. ప్రస్తుతం మిర్చి పంట తెగుళ్లతో ది గుబడి తగ్గిందని, మరో వైపు ధరలు కూడా ప డిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప రిస్థితి ఏర్పడిందన్నారు. గత ఏడాది రూ.25వేలు పలకగా, నిల్వ ఉంచిన మిర్చిని ప్రస్తుతం రూ.10 వేలకు అడుగుతున్నారని, అందువల్ల పాత ధర లకే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కో రారు. జె.జయంతిబాబు అధ్యక్షతన జరిగిన సమా వేశంలో పెంట్యాల హనుమంతరావు, అబ్బూరి వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, తిరుపతిరెడ్డి, తిప్పారె డ్డి, కొల్లూరు వెంకటేశ్వర్లు, సుబ్బారావు, ఎం.బ్రహ్మ య్య, ఎన్‌.వెంకన్న, నరసింహం పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 11:51 PM