అభివృద్ధికి కార్యకర్తలు పాటుపడాలి
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:04 AM
చీరాల నియోజకవర్గ అభివృద్ధికి టీడీపీ కూటమి కార్యకర్తలందరూ పాటుపడాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం చీరాల మండల పరిధిలోని తోటవారిపాలెంకు చెందిన మాజీ వైస్ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 400 కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఎమ్మెల్యే కొండయ్య పిలుపు
చీరాలటౌన్, జనవరి31 (ఆంధ్రజ్యోతి) : చీరాల నియోజకవర్గ అభివృద్ధికి టీడీపీ కూటమి కార్యకర్తలందరూ పాటుపడాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం చీరాల మండల పరిధిలోని తోటవారిపాలెంకు చెందిన మాజీ వైస్ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 400 కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కొండయ్య వారికి పార్టీ కండువాలను వేసి స్వాగతించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కక్షలుకార్పణ్యాలకు తావులేకుండా అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. ప్రతి ఒక్కరు గ్రామీణ స్థాయిలో సమన్వయ పరచుకుని పార్టీ సంక్షేమాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. అనంతరం సిద్ధి వెంకట బుచ్చేశ్వరరావు, నాదెండ్ల కోటేశ్వరరావు గజమాలతో కొండయ్యను సత్కరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు.
వాసవీమాత పట్టువస్ర్తాల సమర్పణ
నల్లగాంధీ బొమ్మ సమీపంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వాసవీమాతకు పట్టువస్ర్తాలను స మర్పించారు. అంతకుముందు కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేకు ఘ నంగా స్వాగతం పలికారు. స్థానిక శివదత్త క్షేత్రంలో గణపతి సచ్చిదానందసామిని ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిశారు. స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.