Share News

అక్రమ లేఅవుట్‌లపై చర్యలు

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:23 PM

నిబంధనలు పాటించకుండా అనఽధికార లేఅవుట్‌లు నిర్మిస్తే చర్యలు తప్పవని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు అన్నారు. వేటపాలెం తహసీల్దార్‌ ఆధ్వర్యంలో మండల పరిధిలోని అక్కాయిపాలెంలో కన్వర్షన్‌ కోసం అర్జీలు చేసుకున్న లేఅవుట్‌లను పరిశీలించి విచారణ చేశారు.

అక్రమ లేఅవుట్‌లపై చర్యలు
లేఅవుట్‌లను పరిశీలిస్తున్న ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, తహసీల్దార్‌ పార్వతి

ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు

వేటపాలెం(చీరాలటౌన్‌), ఫిబ్రవరి8 (ఆంధ్రజ్యోతి) : నిబంధనలు పాటించకుండా అనఽధికార లేఅవుట్‌లు నిర్మిస్తే చర్యలు తప్పవని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు అన్నారు. వేటపాలెం తహసీల్దార్‌ ఆధ్వర్యంలో మండల పరిధిలోని అక్కాయిపాలెంలో కన్వర్షన్‌ కోసం అర్జీలు చేసుకున్న లేఅవుట్‌లను పరిశీలించి విచారణ చేశారు. కొనుగోలు దారులకు, ప్రభుత్వానికి నష్టం వాటిల్లకుండా నియమాలు పాలించాలన్నారు. మండల పరిధిలోని నాయునిపల్లి గ్రామంలోని సర్వే నెంబర్‌ 75-3లోని రెండు ఎకరాలు సొన పోరంబోకు భూమి ఆక్రమణ పాలవుతున్నట్లు అందిన సమాచారం మేరకు సిబ్బందిని పురమాయించారు. భూమిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అధికారులు వెంట డీటీ శ్రీకాంత్‌, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 11:23 PM