విధుల్లో లేని సెక్రటరీలపై చర్యలు
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:03 AM
ప్రజలకు సేవలందించా ల్సిన సచివాలయ సెక్రటరీలు ఫీల్డు పేరుతో విధులకు డుమ్మా కొట్టారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయా లని నగర కమిషనర్ డాక్టర్ కె.వెంక టేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

గాంధీనగర్, శివప్రసాద్ కాలనీ సచివాలయాలను తనిఖీ చేసిన కమిషనర్
డుమ్మాకొట్టిన వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశం
ఒంగోలు, కార్పొరేషన్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సేవలందించా ల్సిన సచివాలయ సెక్రటరీలు ఫీల్డు పేరుతో విధులకు డుమ్మా కొట్టారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయా లని నగర కమిషనర్ డాక్టర్ కె.వెంక టేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గతనెల 28న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నగరంలోని 37వ డివిజన్ ఎన్టీఆర్ పార్కులో ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా..’ పేరుతో నిర్వహించిన చర్చావేదికలో సచివాల యాల పనితీరుపై ప్రజలు పలు ఫిర్యాదులు చేశారు. కొంతమంది ఉద్యోగులు అసలు సచివాలయాల్లోనే ఉండటం లేదని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కమిషనర్ వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలనూ ఏకరువు పెట్టారు. దీంతో కొద్దిరోజులుగా ఆ డివిజన్‌లో పనులు జరుగుతున్నాయి. మరికొన్నింటికి సంబం ధించి ఎస్టిమేషన్లు వేసి టెండర్లు ఆహ్వానిస్తున్నారు. చర్చా వేదికలో వచ్చిన ఫిర్యాదుల మేరకు కమిషనర్ శుక్రవారం గాంధీనగర్, శివప్రసాద్ కాలనీ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గాంధీనగర్‌లోని సచివాలయంలో పని చేసే సెక్రటరీల్లో ఒక్కరు కూడా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి నోటీసులు ఇవ్వాలని అక్కడే ఉన్న నోడల్ ఆఫీసర్ బాషాను ఆదేశించారు. అలాగే ఇస్లాంపేటలో ఎమినిటీ సెక్రటరీగా పనిచేస్తున్న సుభాష్‌రెడ్డి ఎలాంటి సెలవు పెట్టకుండా జనవరి 17 నుంచి విధులకు గైర్హాజరు కావడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 రోజుల్లో సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీచేశారు.