Share News

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:40 AM

ఒంగోలు నగరం అన్నవరప్పాడు సర్వేనెంబరు 7లో మార్కెట్‌విలువతో నాల్గవ తరగతి ఉద్యోగులకు కేటాయించిన స్థలాలను ఆక్రమించుకున్న వారిపై చర్య లు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జి ల్లా అధ్యక్షుడు కోమటిగుంట వెంకటేశ్వర్లు కోరారు.

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి

నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం డిమాండ్‌

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగరం అన్నవరప్పాడు సర్వేనెంబరు 7లో మార్కెట్‌విలువతో నాల్గవ తరగతి ఉద్యోగులకు కేటాయించిన స్థలాలను ఆక్రమించుకున్న వారిపై చర్య లు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జి ల్లా అధ్యక్షుడు కోమటిగుంట వెంకటేశ్వర్లు కోరారు. స్థానిక సంఘ కా ర్యాలయంలో నాయకులు పూల శ్రీనివాసరావు, గోసు సుబ్బారాయుడు తో కలిసి గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. మార్కెట్‌ విలువ ప్రకారం 1972లో 9.70 ఎకరాలు కేటాయించగా ఆ భూమిలో నాల్గవతరగతి ఉద్యోగులకు 144ప్లాట్లుగా విభజించి ఇచ్చారన్నారు. మరో 1.10 ఎకరాల భూమిని రిజర్వుగా ఉం చారని, అయితే ఆ స్థలాన్ని చిరంజీవి అనే ఆ్యక్తి అక్రమించుకొని ఆ భూమిని ప్లాట్లుగా విభజించి అమ్మకాలు చేశారని చెప్పారు. ఈ విష యాన్ని తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళామనే ఉద్దేశంతో త మపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నా రన్నారు. తమపై అనేక తప్పుడు కేసులు కూడా పెట్టారన్నారు. అనేక అక్రమాలకు పాల్పడిన చిరంజీవిపై అనేక కేసులు కూడా నమోద య్యాయని, అయినా తమపై అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. వీటన్నిం టిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని వారు కోరారు.

Updated Date - Mar 07 , 2025 | 12:40 AM