కోలాహలంగా ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:48 PM
మండలంలోని పొట్లపాడు గ్రామంలో రామయోగి స్వామి తిరునాళ్ళ సందర్భంగా శుక్రవారం ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన నిర్వహించారు. సీనియర్ విభాగంలో పోటీలు నిర్వహించారు.

కురిచేడు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని పొట్లపాడు గ్రామంలో రామయోగి స్వామి తిరునాళ్ళ సందర్భంగా శుక్రవారం ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన నిర్వహించారు. సీనియర్ విభాగంలో పోటీలు నిర్వహించారు. మొత్తం 9 ఎడ్ల జతలు పోటీలలో పాల్గొన్నాయి. కోలాహలంగా జరిగిన ఎడ్ల బలప్రదర్శన ప్రజలకు ఆకట్టుకున్నాయి. శనివారం ఆరుపళ్ళ విభాగంలో పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.