Share News

డాక్టర్‌ కవితకు అరుదైన పురస్కారం

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:06 AM

ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన కృషి చేసినందుకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ముక్కు కవితకు అరుదైన పురస్కారం లభించింది. టైమ్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా హెల్త్‌ కేర్‌ అవార్డ్స్‌లో ఆమెకు చోటు దక్కింది.

డాక్టర్‌ కవితకు అరుదైన పురస్కారం
డాక్టర్‌ కవితకు అవార్డును అందజేస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు చేతుల మీదుగా ప్రదానం

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన కృషి చేసినందుకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ముక్కు కవితకు అరుదైన పురస్కారం లభించింది. టైమ్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా హెల్త్‌ కేర్‌ అవార్డ్స్‌లో ఆమెకు చోటు దక్కింది. ఆదివారం విశాఖపట్నంలో అవార్డుల ప్రదానం జరిగింది. కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు చేతుల మీదుగా డాక్టర్‌ కవిత అవార్డును అందుకున్నారు. కనిగిరి శాసనసభ్యుడు డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి సతీమణి అయిన డాక్టర్‌ కవిత గుంటూరు జీజీహెచ్‌లో గ్యాస్ట్రో ఎటా్ట్రలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. జిల్లాలోని పశ్చిమప్రాంత ప్రజలకు కూడా ఆమె సుపరిచితులు. ఆరోగ్య సంరక్షణ భవిష్యత్‌ను రూపొందించడంలో మెరుగైన పాత్ర పోషించినందుకు ఆమెకు అవార్డు ఇచ్చినట్లు నిర్వాహకులు ప్రకటించారు. కవిత కృషిని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రత్యేకంగా కొనియాడారు.

Updated Date - Feb 17 , 2025 | 12:06 AM