Share News

సాధారణ కౌన్సిల్‌లో పొలిటికల్‌ హైడ్రామా

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:57 PM

చీరాల మునిసిపల్‌ కౌన్సిల్‌ హాలులో చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు అఽధ్యక్షతన సాధారణ కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం జరిగింది. సభ ప్రారంభం నుంచే పొలికటికల్‌ హైడ్రామా నడిచింది. ముందుగా వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబు మాట్లాడుతూ గత నెలలో జరిగిన సమావేశంలో టీడీపీ కౌన్సిలర్‌ సల్లూరి సత్యానందం చైర్మన్‌ హోదాకు విలువలేదని అన్నారని, రాజ్యాంగ విధివిధానాలకు కట్టుబడి ఎంతో విలువైన స్థానాన్ని అపహాస్యం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు హేయమన్నారు.

సాధారణ కౌన్సిల్‌లో పొలిటికల్‌ హైడ్రామా
మునిసిపల్‌ చైర్మన్‌కు డీసెంట్‌నుఅందజేస్తున్న టీడీపీ కౌన్సిలర్‌లు

రెండు పార్టీల కౌన్సిలర్‌లు ఢీ అంటే ఢీ

సభ ఆరంభం నుంచే ఉత్కంఠ

టీడీపీ కౌన్సిలర్‌ సత్యానందంను

మూడు నెలల సస్పెండ్‌కు వైసీపీ వ్యూహం

ఎమ్మెల్యే కొండయ్య రాకతో వ్యవహారం తారుమారు

చీరాలటౌన్‌, జనవరి31 (ఆంధ్రజ్యోతి) : చీరాల మునిసిపల్‌ కౌన్సిల్‌ హాలులో చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు అఽధ్యక్షతన సాధారణ కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం జరిగింది. సభ ప్రారంభం నుంచే పొలికటికల్‌ హైడ్రామా నడిచింది. ముందుగా వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబు మాట్లాడుతూ గత నెలలో జరిగిన సమావేశంలో టీడీపీ కౌన్సిలర్‌ సల్లూరి సత్యానందం చైర్మన్‌ హోదాకు విలువలేదని అన్నారని, రాజ్యాంగ విధివిధానాలకు కట్టుబడి ఎంతో విలువైన స్థానాన్ని అపహాస్యం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు హేయమన్నారు. సభ జరగాలంటే ముందు సత్యానందం క్షమాపణ కోరాలని లేదా అతనని సభ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సత్యానందం బదులిస్తూ చైర్మన్‌ హోదాకు ఎక్కడా భంగం కలిగించలేదని అలా జరిగి ఉంటే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. అతనికి టీడీపీ మరో కౌన్సిలర్‌ సాంబశివరావు మద్దతు పలికారు. దీంతో ఆరంభమైన రగడ హోరాహోరీగా మారింది. వైసీపీ కౌన్సిలర్‌లు గుంటూరు ప్రభాకరరావు, కీర్తి వెంకటరావు, బత్తుల అనిల్‌కు టీడీపీ కౌన్సిలర్‌లు మించాల సాంబశివరావు, సత్యానందం, సూరగాని లక్ష్మి, గోలి స్వాతి తదితరుల మధ్య వాడి వేడిగా వాదనలు జరిగాయి. ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శించుకున్నారు. చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు వైసీపీ కౌన్సిలర్‌లకు అనుకూలంగా మాట్లాడారు. దీంతో టీడీపీ కౌన్సిలర్‌ సత్యానందంను మూడు మాసాలు సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు.

కౌన్సిల్‌లో వాణి వినిపించిన కౌన్సిలర్‌ లక్ష్మి

అనంతరం అజెండాలోని 27 అంశాలకు గాను రెండు మూడు అంశాలపై అభ్యంతరాలు తెలుపుతూ మిగిలిన వాటిని పాస్‌ చేయాలని వారికి వారే చెప్పారు. దీంతో 5వ వార్డు కౌన్సిలర్‌ సూరగాని లక్ష్మి చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు తీరుపై అసహనం చెందారు. వైసీపీ కౌన్సిలర్‌లు మాట్లాడుతున్నప్పుడు వారికి సహకరించి టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడనివ్వడం లేదని మండిపడ్డారు. ఇది పద్ధతి కాదని సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేద ప్రజలకు, పూట కూలీలకు నాణ్యమైన ఆహారం అందించే దిశగా అన్న క్యాంటీన్‌లు ప్రారంభిస్తే వాటి ఆధునికీకరణలో భాగంగా వైఫై కనెక్షన్‌, సీసీ కెమెరా, ఫుడ్‌ వేయింగ్‌ మిషన్‌, డోర్లు విండో గ్లాస్‌లకు అవసరమైన మరమ్మతులకు సంబధించిన అంశాలను రద్దు చేయాలని వైసీపీ కౌన్సిలర్‌లు, చైర్మన్‌ వ్యవహరించిన తీరు ఘోరమన్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్యా వాద సాగింది. మిగిలిన అంశాలు పాస్‌ అంటూ కౌన్సిలర్‌ ముగించే దశలో ఉండగా ఎమ్మెల్యే కొండయ్య రాకతో వైసీపీ వ్యూహాలు తారుమారయ్యాయి.

అసాధారణమైన సభను ప్రశంతంగా జరిపించండి

- ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య

ఈవిధమైన వివాదాలు రేగుతుండగా ఎమ్మెల్యే, ఎక్స్‌ అఫిషియో సభ్యుడు ఎంఎం కొండయ్య రాకతో పరిస్థితులు మారిపోయాయి. సభలో చోటుచేసుకున్న పరిస్థితులను కౌన్సిలర్‌లు ఎమ్మెల్యేకు వివరించారు. ఇది జరుగుతుండగా కొందరు వైసీపీ సభ్యులు వెళ్లిపోయారు. దీంతో మళ్లీ ఎక్స్‌ అఫిషియో సభ్యులను గౌరవించకపోవడం సభామర్యాద కాదని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విలువైన సమయాన్ని వృఽథా చేయకూడదన్నారు. ప్రశాతంమైన వాతారణంలో అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించి ఆమోదించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు పట్టంగట్టారని ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇప్పటికే రూ. 10కోట్లతో పనులు చేసినట్లు వివరించారు.త్వరలో మరో రూ.2కోట్లు మంజూరవుతున్నట్లు చెప్పారు. ఈసమయంలో సభను సజావుగా నిర్వహించాలన్నారు. తమ కౌన్సిలర్లు బయటకు వెళ్లారంటూ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి సభకు హాజరైన చైర్మన్‌ సత్యానందం తీరుపై తమకౌన్సిలర్‌లు అసంతృప్తిగా ఉన్నారని సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే కొండయ్య వాయిదా వేయడం సమంజసం కాదని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని, అవసరమైతే అవిశ్వాస తీర్మానం ప్రకటిస్తామని హెచ్చరించారు. అయినా కూడా చైర్మన్‌ సభ నుంచి వెళ్లి పోయారు. దీంతో టీడీపీ కౌన్సిలర్‌లు చైర్మన్‌కు డీసెంట్‌ను అందజేశారు.

Updated Date - Jan 31 , 2025 | 11:57 PM