ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2025-05-28T22:44:44+05:30 IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు జయంతి వేడుకలు పట్టణంలో బుధవారం ఘనంగా జరిగాయి. స్థానిక దోర్నాల బస్టాండ్‌లోని ఆయన విగ్రహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ కేక్‌ కత్తిరించి కార్యకర్తలు, అభిమానులకు మిఠాయిలు పంచిపెట్టారు.

ఎన్టీఆర్‌కు ఘన నివాళి
మార్కాపురంలో.. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

మార్కాపురం, మే 28 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు జయంతి వేడుకలు పట్టణంలో బుధవారం ఘనంగా జరిగాయి. స్థానిక దోర్నాల బస్టాండ్‌లోని ఆయన విగ్రహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ కేక్‌ కత్తిరించి కార్యకర్తలు, అభిమానులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్బంగా టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్‌ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం అన్న ఎన్టీఆర్‌ చివరి శ్వాసవరకు పనిచేశారన్నారు. తెలుగుజాతి ఈ భూమిపై ఉన్నన్నినాళ్లూ ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాలి కొండయ్య, వక్కలగడ్డ సుధాకర్‌, పఠాన్‌ ఇబ్రహీంఖాన్‌, షేక్‌ మౌళాలి, సయ్యద్‌ గఫార్‌, హుసేన్‌ఖాన్‌ పాల్గొన్నారు.

తర్లుపాడు : మండలంలోని తర్లుపాడు, సీతానాగులవరంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తర్లుపాడు బస్టాండ్‌ సెంటర్‌లో, నాగులవరంలో అన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తర్లుపాడు గ్రామ కమిటీ అధ్యక్షుడు సుబ్బయ్య, శ్రేణులు పాల్గొన్నారు.

పొదిలి : ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను తహసీల్దార్‌ కార్యాలయంలో క్రిష్ణారెడ్డి, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ కేఎల్‌ఎన్‌రెడ్డి ఎన్టీఆర్‌ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. కాటూరివారిపాలెంలో మాజీ సర్పంచ్‌ కాటూరి నారాయణరావు ఎన్టీఆర్‌, కాటూరి నారాయస్వామి విగ్రహాలకు పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. పెద్ద బస్టాండ్‌ సెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్‌, జిల్లా ముస్లిం మైనారిటీ కార్యదర్శి షేక్‌ రసూల్‌ నివాళులర్పించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం మహానాడుకు తరలివెళ్లారు.

గిద్దలూరు టౌన్‌ : ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముత్తుముల క్రిష్ణకిశోర్‌రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక స్వేచ్ఛ కల్పించిన మహానాయకుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు మధుసూదన్‌, బైలడుగు బాలయ్య, రాయప్రోలు సుబ్బరాయశర్మ, పందీటి రజనీబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కంభం : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని కంభం, అర్ధవీడు మండలాల్లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండలం ఎల్‌కోట గ్రామంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నాయకులు, ఒంగోలు పార్లమెంటు ముస్లిం మైనారిటీ సెల్‌ కార్య నిర్వాహక కార్యదర్శి అతార్‌ షేక్‌ హుస్సేన్‌ (దాదా) ఆధ్వర్యంలో, కంభం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో వీరభద్రాచారి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సభ్యులు సయ్యద్‌ రఫి ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించిన తరువాత కడపలో జరిగే మహానాడుకు తరలివెళ్లారు.

రాచర్ల (గిద్దలూరు) : రాచర్ల గ్రంథాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రంథపాలకులు శ్రీధర్‌రెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్‌ రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమాలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాలను ఎగురవేసి ఎన్‌టిఆర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్యక్ర మంలో యోగానంద్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : సంక్షేమ పథకాలతో పేదల హృదయాల్లో ఎన్టీఆర్‌ మహనీయుడి స్థానం పొందారని జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మన్నె రవీంద్ర అన్నారు. ప్రధాన సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన నాయకులతో కలిసి మహానాడు సభకు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు, మండల మాజీ అధ్యక్షుడు వడ్లమూడి లింగయ్య, షేక్‌ జిలానీ, వూట్ల సీతారామయ్య, మైనార్టీసెల్‌ అధ్యక్షుడు షేక్‌ ఇస్మాయిల్‌, పోతిరెడ్డి రమణారెడ్డి, బాదరయ్య, వెంకటేశర్లు, మూర్తయ్య పాల్గొన్నారు.

త్రిపురాంతకం మండల తహసీల్దారు కార్యాలయంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలేవసి నివాళులర్పించారు.

త్రిపురాంతకం గ్రామ సచివాలయంలో ఎన్టీఆర్‌కు ఉద్యోగులు, సిబ్బంది నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో రామసుబ్బయ్య పాల్గొన్నారు.

పుల్లలచెరువు : ఎన్టీఆర్‌ జ యంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి తహసీల్దార్‌ కా ర్యాలయంలో నివాళులర్పించా రు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కే వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2025-05-28T22:44:45+05:30 IST