Share News

27 నుంచి ఎఫ్‌ఏ-3 పరీక్షలు

ABN , Publish Date - Jan 25 , 2025 | 02:11 AM

జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈనెల 27నుంచి 30 వరకు ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌-3 (ఎఫ్‌ఎ-3) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు డీఈవో కిరణ్‌కుమార్‌, డీసీఈబీ కార్యదర్శి ఎం.శ్రీనివా సరావు షెడ్యూల్‌ విడుదల చేశారు.

27 నుంచి ఎఫ్‌ఏ-3 పరీక్షలు

షెడ్యూల్‌ విడుదల

ఒంగోలు విద్య, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈనెల 27నుంచి 30 వరకు ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌-3 (ఎఫ్‌ఎ-3) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు డీఈవో కిరణ్‌కుమార్‌, డీసీఈబీ కార్యదర్శి ఎం.శ్రీనివా సరావు షెడ్యూల్‌ విడుదల చేశారు. 1 నుంచి 5వ తరగతి చదు వుతున్న విద్యార్థులకు 27వతేదీ ఉదయం 10నుంచి 11 గంటల వరకు ఓఎస్‌ఎన్‌ఎస్‌, 28న ఉదయం తెలుగు, మధ్యాహ్నం గణితం, 29న ఉదయం ఇంగ్లీషు, మధ్యాహ్నం పరిసరాల విజ్ఞాన పరీక్షలు జరుగుతాయి. 6,7,8 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 1.10 నుంచి 2.10 వరకు, మళ్లీ 2.20 నుంచి 3.20 వరకు ప్రతి రోజూ రెండు పరీక్షలు నిర్వహిస్తారు. హైస్కూళ్లలో 9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 10నుంచి 11 గంటల వరకు, మళ్లీ 11.15నుంచి 12.15 గంటల వరకు రెండు పరీక్షలు జరుగుతాయి. 1నుంచి 5 తరగతుల ప్రశ్నపత్రా లను స్కూలు కాంప్లెక్స్‌ల్లో, 6నుంచి 10 తరగతుల ప్రశ్నపత్రా లను ఎమ్మార్పీలలో భద్రపర్చాలని వారు ఆదేశించారు.

Updated Date - Jan 25 , 2025 | 02:11 AM