Share News

మట్టి ఖర్చులకు రూ.15వేలు

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:17 AM

అంగన్‌వాడీ కేంద్రాలలో పని చేసేవారు చనిపోతే మట్టి ఖర్చులకు రూ.15వేలను ప్రకటిస్తూ కూటమి ప్రభుత్వం జీవో చేయడంపట్ల అంగన్‌వాడీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. గురువారం అద్దంకిలో తెలుగునాడు అంగన్‌వాడీ ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు మట్టి ఖర్చుల జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ థ్యాంక్యూ సీఎం సార్‌ అంటూ పూలతో ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

మట్టి ఖర్చులకు రూ.15వేలు
సీఎంకు థ్యాంక్స్‌ చెప్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

హర్షం వ్యక్తం చేసిన తెలుగునాడు

అంగన్‌వాడీ ట్రేడ్‌ యూనియన్‌ సభ్యులు

అద్దంకిటౌన్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : అంగన్‌వాడీ కేంద్రాలలో పని చేసేవారు చనిపోతే మట్టి ఖర్చులకు రూ.15వేలను ప్రకటిస్తూ కూటమి ప్రభుత్వం జీవో చేయడంపట్ల అంగన్‌వాడీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. గురువారం అద్దంకిలో తెలుగునాడు అంగన్‌వాడీ ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు మట్టి ఖర్చుల జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ థ్యాంక్యూ సీఎం సార్‌ అంటూ పూలతో ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగునాడు అంగన్‌వాడీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు గడ్డం అనంతలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ పాలనలో అంగన్‌వాడీల జీతాల కోసం, ఇతర సమస్యల పరిష్కారం కోసం రోజుల తరబడి దీక్షలు చేసినా పట్టించుకోలేదన్నారు. మట్టిఖర్చుల పథకాన్ని వారు అమలు చేయలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో ప్రశాంత వాతావరణం, అంగన్‌వాడీల సమస్యల కోసం ప్రభుత్వం చూపిన చోరవతో ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందుతున్నాయన్నారు. అలాగే పని భారాన్ని తగ్గించినందుకు కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు ఽధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా నాయకురాలు ధనలక్ష్మి, జె. లీలా, టీ పార్వతి, టి.సుబ్బమ్మ, చంద్రమతి, శ్రీలక్ష్మి, జయలక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్‌లు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 01:17 AM