Diploma Engineers Association: 18న ఈఎన్‌సీ కార్యాలయం వద్ద ధర్నా
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:03 AM
తమ న్యాయమైన సమస్యలను ఈ నెల 18వ తేదీ లోపు పరిష్కరించేందుకు చొరవ చూపకుంటే, 18న ఈఎన్‌సీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని పంచాయతీరాజ్ డిప్లమో ఇంజనీర్ల అసోసియేషన్ హెచ్చరించింది.
ఆ లోపు సమస్యలు పరిష్కరించాలి
పీఆర్ డిప్లమో ఇంజనీర్ల అసోసియేషన్ నోటీసు
అమరావతి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): తమ న్యాయమైన సమస్యలను ఈ నెల 18వ తేదీ లోపు పరిష్కరించేందుకు చొరవ చూపకుంటే, 18న ఈఎన్‌సీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని పంచాయతీరాజ్ డిప్లమో ఇంజనీర్ల అసోసియేషన్ హెచ్చరించింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రవీంద్ర, ప్రధాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి గురువారం పంచాయతీరాజ్ ఇంజనీర్-ఇన్-ఛీప్ బాలూనాయక్‌ను కలిసి నోటీసు అందజేశారు. ఇటీవల జరిగిన బదిలీ కౌన్సెలింగ్‌లో డిప్లమో ఇంజనీర్లకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 74 మంది సైట్ ఇంజనీర్లను రెగ్యులర్ చేసేందుకు సిఫారసు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆక్షేపించారు. ఆయా శాఖల అధిపతులకు డిపార్ట్‌మెంట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని మే 30 లోపు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ నిర్వహించలేదని తెలిపారు.