AP Police : తులసిబాబుకు మళ్లీ నోటీసులు
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:14 AM
ట్రిపుల్‌ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేటు వ్యక్తికి పోలీసులు సోమవారం మళ్లీ నోటీసులు జారీచేశారు.

ఒంగోలుక్రైం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ట్రిపుల్‌ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేటు వ్యక్తికి పోలీసులు సోమవారం మళ్లీ నోటీసులు జారీచేశారు. సీఐడీ కస్టడీ సమయంలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గుండెలపై కూర్చుని వేధించారనే అనే ఫిర్యాదు మేరకు కామేపల్లి తులసిబాబును ఈ నెల 3న విచారణకు హాజరుకావాలని ఆ కేసు విచారణాధికారి అయిన ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ నోటీసులు జారీచేశారు. అయితే తాను అనారోగ్యంతో ఉన్నానంటూ తులసిబాబు గడువు కోరాడు. అయితే ఈ నెల 8న జరిగే విచారణకు హాజరుకావాలని ఎస్పీ మరోసారి అతనికి నోటీసులు జారీచేశారు.