Srikakulam Police: ఇత్తడి చెంబును.. అక్షయపాత్రగా నమ్మించి..
ABN , Publish Date - May 31 , 2025 | 05:15 AM
శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఇత్తడి చెంబును అక్షయపాత్రగా నమ్మించి రూ. 25 లక్షల డీల్‌కు ముఠాను అరెస్టు చేశారు. వారు రూ. 5 లక్షల అడ్వాన్స్ ఇచ్చే సమయంలో వలపనిలో పట్టు చేసుకున్నారు.
రూ.25 లక్షలకు బేరం.. రూ.5లక్షలు అడ్వాన్సు
స్నేహితులనే బురిడీ కొట్టించిన ప్రధాన నిందితుడు
శ్రీకాకుళం, మే 30(ఆంధ్రజ్యోతి): ఇత్తడి చెంబును మహిమ గల అక్షయపాత్రగా అని నమ్మించి.. రూ. 25 లక్షలకు టోకరా వేసేందుకు యత్నించిన ముఠాను.. శ్రీకాకుళం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను శుక్రవారం జిల్లా పోలీసుల కార్యాలయంలో ప్రవేశపెట్టారు. అదనపు ఎస్పీ కేవీ రమణ, శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద కథనం మేరకు.. ప్రధాన నిందితు డు, విశాఖపట్నంలోని మధురవాడకు చెందిన పచ్చితల రవిశంకర్.. స్నేహితులతో కలిసి సులభంగా డ బ్బు సంపాదించాలని భావించాడు. చివరికి స్నేహితులతో కలసి వారినే ముంచేందుకు ‘అక్షయపాత్ర’ ఆలోచన చేశాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల ప్రాంతానికి చెందిన పూని భద్రయ్య వద్ద పురాతన వస్తువు రైస్ పుల్లింగ్ అక్షయపాత్ర(ఇత్తడి చెం బు) ఉంది. దానికి మహిమలున్నాయని తన స్నేహితులకు చెప్పి.. ఎలా అయినా దానిని కొనుగోలు చేసుకుందామంటూ ఒప్పించాడు.చెంబును రూ.25 లక్షలకు బేరం కుదిర్చాడు. ఇందులో అడ్వాన్సుగా రూ.5 లక్షలు ఇచ్చేందుకు స్నేహితులు రుద్రరాజు వెంకటరంగరాజు, రౌతు కనకరాజు(పెదగంట్యాడ), నక్కిన రఘునాథరావు (నరసన్నపేట), గట్టెక్కల మురళీకృష్ణ(తిరుపతి జిల్లా), గరిక శ్రీను(హైదరాబాద్), కొండ వెంకటనాగ సత్యనారాయణ(పిఠాపురం)లను ఒప్పించాడు. గురువారం సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస ప్రాంతం లో భద్రయ్యకు రూ.5లక్షలు ఇస్తుండగా, పోలీసులు వల పన్ని మొత్తం అందరినీ పట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News