PM Modi Speech: ఆపరేషన్ సిందూర్ అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్
ABN , Publish Date - Jun 01 , 2025 | 04:51 AM
Operation Sindhur Symbolizes Indian Valor, PM Modi’s Strong Message to Pakistan, Largest Anti-Terror Operation in India’s History, Honoring Queen Ahilyabai Holkar’s Legacy in Women Empowerment
భోపాల్, మే 31: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ స్పందనతో ‘సిందూరం’ ఇప్పుడు శౌర్యానికి చిహ్నంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదుల పరోక్ష యుద్ధాలు ఇకపై చెల్లవని, వారి బుల్లెట్లకు ఫిరంగి గుండ్లతో సమాధానం ఇస్తామని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్‌ను దేశ చరిత్రలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌గా ఆయన అభివర్ణించారు. రాణి అహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా శనివారం భోపాల్‌లో నిర్వహించిన ‘లోకమాత దేవీ అహిల్యాబాయి మహిళా స్వశక్తికరణ్ మహా సమ్మేళన్’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘సిందూరం నారీ శక్తికి చిహ్నం. పహల్గాంలో ఉగ్రవాదులు మన నారీశక్తిని సవాలు చేశారు. అదే వారి ఉగ్రవాదులతో పాటు వారిని పోషిస్తున్న వారికి మృత్యు ఘంటికలు మోగించింది’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News