PM Modi: ప్రగతి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయాలి
ABN , Publish Date - Jun 26 , 2025 | 06:31 AM
వివిధ ప్రగతి ప్రాజెక్టులు, పథకాలను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు.
సీఎ్‌సలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశం
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): వివిధ ప్రగతి ప్రాజెక్టులు, పథకాలను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. ఆధార్ సంబంధిత ఫిర్యాదులు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ర్ఫాస్ట్రక్చర్ మిషన్(పీఎం-అభియాన్), 5 స్ట్రీమ్ అల్యూమినియం రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు తదితరాలపై బుధవారం ఢిల్లీ నుంచి క్యాబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్‌తో కలిసి సీఎ్‌సలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు ప్రాజెక్టులు, పథకాలపై ఆయా రాష్ట్రాల సీఎ్‌సలతో మోదీ సమీక్షించారు. మన రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.