Pawan Kalyan: జనసేనలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు..
ABN , Publish Date - Mar 07 , 2025 | 09:37 PM
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండెం దొరబాబు జనసేనలో చేరారు. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, దొరబాబుకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండెం దొరబాబు జనసేనలో చేరారు. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, దొరబాబుకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. పెండెం దొరబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.
జనసేన పార్టీలో చేరిన వారిలో తూర్పు గోదావరి జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొత్తపలి పద్మతో పాటు వైసీపీ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఇతర నాయకులు ఉన్నారు. వీరందరినీ పవన్ కల్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరి ప్రసాద్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..