Share News

AP High Court: ఇంటింటికి రేషన్‌ వ్యవస్థ రద్దు జీవోపై పిటిషన్‌

ABN , Publish Date - May 31 , 2025 | 05:06 AM

ఇంటింటి రేషన్‌ పంపిణీ రద్దు జీవోకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. జీవనోపాధి కోల్పోతున్నామని వాహనదారులు పేర్కొంటూ ప్రభుత్వంపై నోటీసులు జారీ అయ్యాయి.

AP High Court: ఇంటింటికి రేషన్‌ వ్యవస్థ రద్దు జీవోపై పిటిషన్‌

కౌంటర్‌ దాఖలు చేయాలని పౌరసరఫరాల శాఖకు హైకోర్టు ఆదేశం

అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): ఇంటింటికి రేషన్‌ పంపిణీ వ్యవస్థను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 23న జారీ చేసిన జీవో 5ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రభుత్వ నిర్ణయంతో వాహన ఆపరేటర్లు జీవనోపాధి కోల్పోతున్నారని తాము దాఖలు చేసిన పిటిషన్‌లో రాజమహేంద్రవరానికి చెందిన తానేటి రామకృష్ణ, మంగళగిరి ధనంజయకుమార్‌, గుట్టంరాజు సుచాన్‌ సింగ్‌, జి.త్రినాథ్‌ పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం లంచ్‌మోషన్‌గా విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పౌరసరఫరాలశాఖను ఆదేశించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పౌరసరఫరాలశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, పౌరసరఫరాల కార్పోరేషన్‌ ఎండీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ఉత్తర్వులు ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 05:06 AM