Amaravati : ప్రకృతి సేద్యం విస్తరణకు కీలక ఒప్పందం
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:26 AM
విజయవాడలోని మార్కెఫెడ్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఎక్స్‌అఫిషీయో స్పెషల్ సీఎస్ రాజశేఖర్ సమక్షంలో రైతు సాధికార సంస్థ...

రైతు సాధికార సంస్థతో అమెరికా సంస్థల ఎంవోయూ
అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు రైతు సాధికార సంస్థతో అమెరికాకు చెందిన పెగాసన్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్ ట్రస్ట్ త్రైపాక్షిక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. శనివారం విజయవాడలోని మార్కెఫెడ్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఎక్స్‌అఫిషీయో స్పెషల్ సీఎస్ రాజశేఖర్ సమక్షంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయకుమార్, పెగాసన్ క్యాపిటల్ అడ్వైజర్స్ సీఈవో క్రేగ్ కోగట్, ప్రొడ్యూసర్ ట్రస్ట్ సీఈవో కీత్ అగోడా ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రకృతి వ్యవసాయంలో 10- 60లక్షల మంది రైతులను భాగస్వామ్యం చేయడం, నిధుల సమీకరణ, పంట ఉత్పత్తుల మార్కెటింగ్, కృత్రిమ మేధ ఆధారిత పరిశోధన, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా పెగాసన్ సీఈవో క్రేగ్ కోగట్, ప్రొడ్యూసర్ ట్రస్ట్ సీఈవో కీత్ అగోడా మాట్లాడారు. ప్రకృతి సేద్యానికి సీఎం చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యతను చూస్తే గర్వంగా ఉందన్నారు.