Share News

MLA Bhashyam Praveen: మొదటిసారి ఎమ్మెల్యేలకు నిధులెక్కువ ఇవ్వండి

ABN , Publish Date - Mar 06 , 2025 | 06:42 AM

రాజధాని అమరావతి రోడ్డు అత్యంత దారుణంగా ఉందని, మొదటి సారి ఎమ్మెల్యేలైన తమకు ఎక్కువ నిధులు కేటాయించి నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయలు కల్పించాలని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌

MLA Bhashyam Praveen: మొదటిసారి ఎమ్మెల్యేలకు నిధులెక్కువ ఇవ్వండి

ABN AndhraJyothy: రాజధాని అమరావతి రోడ్డు అత్యంత దారుణంగా ఉందని, మొదటి సారి ఎమ్మెల్యేలైన తమకు ఎక్కువ నిధులు కేటాయించి నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయలు కల్పించాలని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ చెప్పడం సభలో కాసేపు సరదా చర్చకు దారి తీసింది. సభలో మొదటిసారి ఎన్నికైన సభ్యులు 84 మంది ఉన్నారని, అందరూ రోడ్ల గురించే అడుగుతున్నారని, మంత్రి గారూ వీళ్ల కోర్కెలు తీర్చగలరేమో చూడండి అంటూ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ అన్నారు. బడ్జెట్‌ 8,800 కోట్లు కేటాయిస్తే అందులో 4,300 కోట్లు ఆర్టీసీకి, 4,500 కోట్లు ఆర్‌ అండ్‌ బీకి ఇచ్చామని మంత్రి బీసీ జనార్దనరెడ్డి సమాధానమిచ్చారు. అలాగే ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలందరూ ఇచ్చిన వినతులు తీర్చాలంటే 37వేల కోట్లు కావాలంటూ వివరించారు.

Updated Date - Mar 06 , 2025 | 06:42 AM