Share News

Pawan Kalyan: షష్ఠ షణ్ముఖ క్షేత్రాలకు జనసేన ఎమ్మెల్యేలు

ABN , Publish Date - May 13 , 2025 | 05:11 AM

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టి పాఠం నేర్పిన భారత సైన్యం, దేశ నాయకత్వానికి దైవ బలం, ఆశీస్సులు కోరుతూ వివిధ మురుగన్ ఆలయాల్లో, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ పూజలు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరగనున్నాయి.

Pawan Kalyan: షష్ఠ షణ్ముఖ క్షేత్రాలకు జనసేన ఎమ్మెల్యేలు

సైన్యానికి దైవ బలం కోసం నేడు పూజలు

అమరావతి, మే 12 (ఆంధ్రజ్యోతి): ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో పాకిస్థాన్‌కి గట్టి పాఠం నేర్పిన మన దేశ సైన్యానికి, దేశ నాయకత్వానికి దైవ బలం, ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేయించాలని జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. తమిళనాడులోని ఆరు మురుగన్‌ ఆలయాలతో పాటు కర్ణాటకలో రెండు, మన రాష్ట్రంలోని రెండు సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాలు, విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం, పిఠాపురం పురుహూతికాదేవి ఆలయాల్లో మంగళవారం జనసేన ఎమ్మెల్యేలు, నేతలు పూజలు నిర్వహిస్తారు. తమిళనాడులోని తిరుపరకుండ్రంలోని ఆలయానికి సుందరపు విజయకుమార్‌ (యలచమంచిలి), పళని క్షేత్రానికి పంతం నానాజీ (కాకినాడ రూరల్‌), స్వామిమలైకి బొలిశెట్టి శ్రీనివాస్‌ (తాడేపల్లిగూడెం), తిరుచెందూర్‌ ఆలయంలో పత్సమట్ల ధర్మరాజు (ఉంగుటూరు), తిరుత్తణిలో ఆరణి శ్రీనివాసులు (తిరుపతి), పాలముదిరిచోళై మురుగన్‌ ఆలయంలో శ్రీధర్‌ ( రైల్వేకోడూరు) ఆధ్వర్యంలో పార్టీ నేతలు, శ్రేణులు తరలివెళ్లాయి. మంళవారం ఉదయం ఆయా ఆలయాల్లో పూజలు చేయిస్తారు. కర్ణాటకలోని కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో పూజాదికాల కోసం అనంతపురం నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు వెళ్లారు.


ఈ బృందానికి అనంతపురంలోని హిందూపురం అర్బన్‌ డెవల్‌పమెంట్‌ ఆథారిటీ చైర్మన్‌ టి.సి.వరుణ్‌ నేతృత్వం వహిస్తారు. అలాగే ఘాటీ శ్రీసుబ్రహ్మణ్య క్షేత్రంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నేతృత్వంలోని బృందం పూజలు చేయిస్తుంది. ఇక రాష్ట్రంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌ పూజలు చేయిస్తారు. బిక్కవోలు శ్రీసుబ్రహ్మణ్య ఆలయంలో మంత్రి కందుల దుర్గేశ్‌, మోపిదేవి సుబ్రహ్మణ్య ఆలయంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ ఆధ్వర్యంలో పూజలు జరుగుతాయి. పిఠాపురం పురుహూతిక ఆలయంలో పూజల్లో డీసీసీబీ చైర్మన్‌ తుమ్మల రామస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్‌ పాల్గొంటారు. క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించే పార్టీ నేతలు, శ్రేణులు చర్చిల్లో ప్రార్థనలు చేయిస్తారు. ఇంకోవైపు.. అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారమే శాంతి హోమం చేయించారు. కాగా, నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్‌ నర్సులతో పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. నర్సులను సత్కారించారు.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:11 AM