Pakistan supporters in AP: ఏపీలో పాకిస్తాన్ సపోర్టర్స్.. తల్లిపాలు తాగి..
ABN , Publish Date - May 01 , 2025 | 10:13 PM
'తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం.. ' దీనికి నిర్వచనం నంద్యాలలో జరిగిన ఘటనే అనుకోవాలేమో. ఎందుకంటే, దేశమంతా పాకిస్థాన్ చేసిన ఊచకోతకు కన్నీరు కారుస్తుంటే, ఏపీలోని నంద్యాలలో ఒక వర్గం యువకులు మాత్రం..
Pakistan supporters in AP: మీరు హిందువులా, ముస్లింలా అని అడిగి.. హిందువని తెలిస్తే చాలు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేశారు. ఒక్కరిద్ధరు కాదు.. ఏకంగా 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. అలాంటి వాళ్లకి తర్ఫీదు ఇచ్చి భారత్ లోకి వచ్చి అరాచకాలు చేస్తోంది పాకిస్థాన్. ఇవాళ్టి పహల్గాం ఉదంతమేకాదు, నిన్న, మొన్న.. ఇలా దశాబ్ధాల కాలంగా పాకిస్థాన్ చేస్తున్న నికృష్టపు పనులు అందరికీ తెలిసినవే. ఇంత చేస్తున్న పాకిస్థాన్ మీద రాయలసీమ ప్రాంతమైన నంద్యాల యువకులకు ఎందుకు అంత ప్రేమో అర్థం కాకుండా ఉంది.
వివరాల్లోకి వెళ్తే, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నంద్యాలలో ధర్మ రక్షా దళ్ తరఫున పలువురు యువకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాకిస్థాన్ జెండాలను రోడ్డుపై పడేసి.. వాటిని తొక్కిపడేసి.. ఆందోళనకు దిగారు. పాకిస్తాన్ డౌన్ డౌన్.. ఇండియా జిందాబాద్.. అంటూ నినాదాలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ.. పాక్‌పై తమ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయారు.
అయితే, ఇక్కడ నుంచే అసలు ట్విస్ట్ మొదలైంది. ఇండియాలో పాకిస్తాన్‌కు సపోర్టర్స్ ఉండరుకదా అనుకుంటాం.. అదీ.. ఆంధ్రప్రదేశ్‌లో అలాంటిది అస్సలు ఊహించలేం. కానీ, ఏపీలోనూ పాక్ మద్దతుదారులు ఉన్నారు. ఇది ముమ్మాటికీ నిజం. నమ్మశక్యం కాని నిజం. నంద్యాలలో ధర్మరక్షా దళ్ సభ్యులు నిరసన నిర్వహించి.. పాక్ జెండాలను రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత (అటుగా వెళ్తున్న.. కాదు) పనిగట్టుకుని అదే పనిమీద రెండు బైక్ ల మీద వచ్చిన ఐదుగురు ఓ వర్గం యువకులు ఆ పాకిస్థాన్ జెండాలను ఎవరూ తొక్కకుండా జాగ్రత్తగా తీసి ఇంటికి పట్టుకుపోయారు. అలా పాకిస్థాన్ దేశంపై తమకున్న అభిమానాన్ని, ప్రేమను, ఆప్యాయతను చూపించారు.
అయితే, ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అవడంతో నంద్యాలలో పాక్ జెండాలను సంరక్షించేంత వీరాభిమానులు ఉన్నారనే విషయం వెలుగుచూసింది. ఆ వీడియో ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ యువకులు ఎవరంటూ ఆరా తీస్తున్నారు. భరతమాత పాలు తాగి.. రొమ్ము గుద్దడమంటే ఇదేనేమో కదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..