JanaSena party: పీడ విరగడై ఏడాది
ABN , Publish Date - Jun 05 , 2025 | 06:22 AM
సరిగ్గా ఏడాది క్రితం ప్రజా పక్షమైన కూటమికి పరిపాలన కట్టబెట్టిన ప్రజలు కూటమిపై నమ్మకంతో అసలు ప్రతిపక్షం అనే అవకాశమే ఎవరికీ ఇవ్వలేదు.
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీడ విరగడై ఏడాది. స్వర్ణాంధ్రకు శ్రీకారం చుట్టి ఏడాది. గ్రామాల్లో సమూల మార్పులకు ఏడాది. సుస్థిర పాలనకు, సమగ్రాభివృద్ధికి ఏడాది’ అని ఎమ్మెల్సీ, జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘సరిగ్గా ఏడాది క్రితం ప్రజా పక్షమైన కూటమికి పరిపాలన కట్టబెట్టిన ప్రజలు కూటమిపై నమ్మకంతో అసలు ప్రతిపక్షం అనే అవకాశమే ఎవరికీ ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రతిపక్ష హోదా కావాలని గగ్గోలు పెట్టిన వారు... చివరికి అందరూ ఊహించినట్లుగానే రాక్షసపక్షం వైపే మేము అనే సందేశాన్ని ఇచ్చారు. సంఘ విద్రోహక శక్తులకు కొమ్ముకాస్తూ, ప్రజలపైనే దాడి చేస్తామంటే సమాజం ఒప్పుకోదు’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News