Polavaram: పోలవరంపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదు
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:55 AM
రెండు దశలు.. 41.15 మీటర్లు, 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మాణమంటూ కేంద్రానికి పంపి ఆయన చేసిన పాపం ప్రస్తుతం రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు.

ఆయన రెండు దశల పాపం.. రాష్ట్రానికి శాపం: నిమ్మల
పాలకొల్లు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత జగన్‌కు, వైసీపీ నాయకులకు లేదని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రెండు దశలు.. 41.15 మీటర్లు, 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మాణమంటూ కేంద్రానికి పంపి ఆయన చేసిన పాపం ప్రస్తుతం రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. కేంద్రంలో మోదీ.. రాష్ట్రంలో చంద్రబాబు-పవన్ కల్యాణ్ నాయకత్వంలో డబుల్ ఇంజన్ పాలన వల్లే కేంద్ర బడ్జెట్‌లో పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు, జలజీవన్ మిషన్ పొడిగింపు వంటి పలు ప్రయోజనాలు లభించాయని తెలిపారు. నిమ్మల ఆదివారమిక్కడ టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
పోలవరం విషయంలో అబద్ధాలు మాట్లాడే జగన్‌ను తెలుగు జాతి ప్రజలు, రైతులు క్షమించరని చెప్పారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తిచేసుకున్న డయాఫ్రం వాల్‌ను ధ్వంసం చేసిన ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతారని చెప్పారు. 2019 ఎన్నికల్లో నిర్వాసితులకు ఆయనిచ్చిన హామీలు నీటి మూటలేనని.. ఐదేళ్ల పాలనలో వారికి ఒక్క రూపాయి సాయం చేయలేదని.. పునరావాస కాలనీల్లో అరబస్తా సిమెంట్ పని కూడా చేయకుండా దగా చేశారని ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి
Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...
Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం
Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News and Telugu News