Share News

ISRO Bahubali Rocket: మరికాసేపట్లో.. షార్ నుంచి బాహుబలి రాకెట్ ప్రయోగం..

ABN , Publish Date - Nov 02 , 2025 | 05:11 PM

నెల్లూరు జిల్లా షార్ సెంటర్ నుంచి మరికాసేట్లో.. బాహుబలి రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్లనుంది. ఆదివారం అంటే.. ఈ రోజు సాయంత్రం 5.26 గంటలకు షార్ కేంద్రం నుంచి LVM 3M-5 రాకెట్ ప్రయోగం జరగనుంది.

ISRO Bahubali Rocket: మరికాసేపట్లో.. షార్ నుంచి బాహుబలి రాకెట్ ప్రయోగం..

నెల్లూరు, నవంబర్ 02: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ సెంటర్ నుంచి మరికాసేట్లో.. బాహుబలి రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్లనుంది. ఆదివారం అంటే.. ఈ రోజు సాయంత్రం 5.26 గంటలకు షార్ కేంద్రం నుంచి LVM 3M-5 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఆ క్రమంలో షార్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5.26 గంటలకు ఈ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ బాహుబలి రాకెట్ నింగిలో 16.09 సెకన్ల పాటు ప్రయాణించనుంది. 4,410 కిలోల అత్యంత బరువు ఉన్న CMS - 3 సమాచార ఉపగ్రహాన్ని నింగిలోకి ఈ బాహుబలి రాకెట్ మోసుకుపోనుంది.


ఇస్రో చరిత్రలో ఈ రాకెట్ ప్రయోగం.. అత్యంత కీలక ఘట్టంగా నిలవనుంది. అయితే LVM - 3M బాహుబలి రాకెట్లలోఇది ఐదోవది. ఈ బాహుబలి రాకెట్ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ వి. నారాయణన్‌, పలు విభాగాల అధిపతులు, శాస్త్రవేత్తలు ఇప్పటికే షార్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ రాకెట్ ప్రయోగం నేపథ్యంలో ఈ స్పేస్ సెంటర్ వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు.


షార్‌లోని రెండో లాంచింగ్ పేడ్ నుంచి ఎల్‌వీఎం 3-ఎం5 రాకేట్ ద్వారా సీఎంఎస్ 03 సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడడంతోపాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ కౌంట్‌ డౌన్ ప్రారంభానికి ముందు ఇస్త్రో చైర్మన్ వీ నారాయణ, షార్ డైరెక్టర్ పద్మ కుమార్‌లు.. ఈ రాకెట్ నమూనాలకు తిరుమల శ్రీవారి ఆలయంలో.. శ్రీకాళహస్తిలోని ముక్కటింటి స్వామి వారి సన్నిధితోపాటు సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Nov 02 , 2025 | 05:31 PM