Share News

Indian Migrant: ఈ నరకం భరించలేను.. కాపాడండి

ABN , Publish Date - May 15 , 2025 | 04:22 AM

సౌదీకి వెళ్లిన నెల్లూరు యువకుడు షేక్‌ నజీర్‌ అక్కడి యజమాని చేత చిత్రహింసలు ఎదుర్కొంటున్నాడు. పని చెప్పినట్టుగా కాకుండా కష్టమైన పనులకు వాడుతూ జీతం不给కుండా కొడుతున్నాడని తల్లిదండ్రుల సహాయాన్ని కోరాడు.

 Indian Migrant: ఈ నరకం భరించలేను.. కాపాడండి

బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లిన యువకుడికి చిత్రహింసలు

తమ బిడ్డను ఇంటికి చేర్చాలని వృద్ధ దంపతుల వేడుకోలు

కలువాయి, మే 14(ఆంధ్రజ్యోతి): బతుకుదెరువు కోసం సౌదీఅరేబియాకు వెళ్లిన యువకుడు అక్కడి యజమాని చేతిలో చిత్రహింసలకు గురవుతున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామానికి చెందిన షేక్‌ కాలేషా, బీబీ దంపతుల కుమారుడు షేక్‌ నజీర్‌ 7వ తరగతి వరకు చదువుకుని స్థానికంగా కూలి పనులు చేసేవారు. ఓ ఏజెంట్‌ మాటలు నమ్మి గతేడాది డిసెంబరులో రూ.2లక్షలు ఖర్చు చేసి సౌదీకి వెళ్లారు. అయితే, ఏజెంట్‌ చెప్పినట్లు తోటలలో పని కాకుండా పెద్దపెద్ద చెట్లు ఎక్కడం, కొమ్మలు నరకడం వంటి పనులు చేయమంటున్నారు. ‘చెట్లు ఎక్కడం నాకు రాదు. ఎక్కకుంటే మా యజమాని అదే చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెడుతున్నాడు. ఓసారి చెటు ఎక్కి కింద పడ్డాను. దెబ్బలు తగిలినా డాక్టర్‌కు చూపించలేదు. యజమాని జీతం ఇవ్వట్లేదు. స్వదేశానికి పంపించండి సార్‌ అంటే రూంలో వేసి కొడుతున్నాడు. ఇక ఈ నరకం భరించలేను. దయచేసి నన్ను కాపాడండి సార్‌’.. అంటూ కన్నీటి పర్యంతమవుతూ రికార్డు చేసిన వీడియోను నజీర్‌ తల్లిదండ్రులకు పంపించారు. ఈ వీడియో చూసిన తల్లిదండ్రులు... ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ బిడ్డను కాపాడి ఇంటికి చేర్చాలని వేడుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 04:22 AM