Nellore: షేర్స్‌లో పెట్టుబడి పేరిట దోచేశారు
ABN , Publish Date - May 11 , 2025 | 05:56 AM
నెల్లూరులో షేర్స్ పెట్టుబడిగా చూపించి సైబర్ నేరగాళ్లు రూ.30.62 లక్షలు మోసపోయారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నాగేంద్ర, పెట్టుబడుల చీటింగ్ కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రూ.30.62 లక్షలు మోసపోయిన నెల్లూరు వాసి
నెల్లూరు (స్టోన్‌హౌ్‌సపేట), మే 10(ఆంధ్రజ్యోతి): షేర్స్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలుంటాయని నమ్మించి నెల్లూరులో ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.30.62 లక్షలు దోచేశారు. నగరంలోని కామాటివీధికి చెందిన పొందూరు నాగేంద్ర సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మార్చి 12న ఇన్‌స్ట్రాగ్రాంలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ మెసేజ్ వచ్చింది. వెంటనే నాగేంద్ర ఆ లింక్ క్లిక్ చేయగా ఆయన వాట్సా్‌పకు ఎస్‌ఎంసీ స్టాక్ ట్రెండ్ రీసెర్చ్ ఇనిస్టిస్య్టూట్ అనే గ్రూపులో యాడ్ చేశారు. ఆ తర్వాత వారు చెప్పిన షేర్ కొనుగోలు, అమ్మకాలు చేస్తూ రూ.1.66 లక్షల లాభం పొందాడు. అప్పటి నుంచి నాగేంద్ర ఖాతాల నుంచేగాక తన తండ్రి నాగరాజు అకౌంట్ నుంచి పలు దఫాలుగా రూ.30,62,488 లక్షలు డిపాజిట్ చేశారు. ఈ క్రమంలో నాగేంద్ర అకౌంట్‌లో రూ.38,74,744 నగదు చూపించారు. ఆ నగదును విత్‌డ్రా చేసుకునేందుకు నాగేంద్ర చాట్ చేయగా రూ.12,17,465 డిపాజిట్ చేయాలని చెప్పారు. దీంతో నాగేంద్ర ఈ నెల 8న ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లోను, శనివారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.