నులి పురుగు మాత్రలు వికటించి గిరిజన బాలిక మృతి
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:53 AM
అంగన్వాడీ సి బ్బంది నిర్లక్ష్యానికి ఓ చిన్నారి ప్రాణం బలైంది.

అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలంలో విషాదం
రంపచోడవరం/మారేడుమిల్లి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ సి బ్బంది నిర్లక్ష్యానికి ఓ చిన్నారి ప్రాణం బలైంది. అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం తాడేపల్లికి చెందిన కత్తుల రేష్మిత(5)తో అంగన్వాడీ సిబ్బంది మంగళవారం నులిపురుగుల మాత్రలు వేశారు. అయితే ఆ బాలిక నురగలు కక్కుకుని అపస్మారక స్థితికి చేరుకోవడంతో హుటాహుటిన రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బాలిక మృతి చెందిన విషయం గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి దృష్టికి చేరడంతో ఆమె తీవ్రంగా స్పందించారు. రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలాన్ని తక్షణ విచారణకు ఆదేశించారు. ఆయన హుటాహుటిన తాడేపల్లి చేరుకుని విచారణ చేపట్టారు. వైద్య సిబ్బంది పర్య వేక్షణ లేకుండా, సక్రమ పద్ధతిలో మాత్రలు వేయకపోవడమే ఇందుకు కారణమని ప్రాథమిక విచారణలో గుర్తించారు. అనంతరం ప్రభుత్వానికి విచారణ అంశాలను నివేదించిన ఆయ న ఇందుకు బాధ్యులుగా అంగన్వాడీ సూపర్‌వైజరు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్, ఫార్మాసిస్టులను సస్పెండ్ చేశారు.